Uttarkashi cloudburst: ఉత్తరకాశీలో గంగమ్మ ఉగ్రరూపం.. 11 మంది జవాన్లు గల్లంతు.. కాపాడు శివయ్యా..!

Uttarkashi cloudburst: ఉత్తరకాశీలో గంగమ్మ ఉగ్రరూపం.. 11 మంది జవాన్లు గల్లంతు.. కాపాడు శివయ్యా..!

ధారాలీ: ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లా ధారాలీ గ్రామాన్ని ఉన్నట్టుండి వరదలు తుడిచిపెట్టేయడంతో  సహాయక చర్యల్లో భాగమైన11 మంది ఆర్మీ జవాన్లు కూడా వరద్లలో గల్లంతయ్యారు. హర్సిల్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు ముంచెత్తడంతో ఈ వరదల్లో 11 మంది ఆర్మీ జవాన్లు మంగళవారం సాయంత్రం గల్లంతు కావడం గమనార్హం. దిగువ హర్సిల్ ప్రాంతంలోని ఆర్మీ క్యాంప్ దగ్గర ఉన్న సైనికులు గల్లంతయినట్లు భారత ఆర్మీ వెల్లడించింది.

గంగోత్రికి వెళ్లే ప్రాంతంలో యమునోత్రిని సందర్శించిన తరువాత, చార్ ధామ్ యాత్రలో  రెండవ స్టాప్ గంగోత్రి ధామ్. యమునోత్రి నుండి గంగోత్రి ధామ్‌కి దూరం దాదాపు 220 కిలోమీటర్లు ఉంటుంది. కానీ అక్కడికి చేరుకోవడానికి  నడవాల్సిన అవసరం లేదు. వాహనాల్లో  రోడ్డు మార్గంలో గంగోత్రి ధామ్‌కి సులభంగా చేరుకోవచ్చు. గంగోత్రి ధామ్లో స్వామిని దర్శించుకుంటే   భక్తుల పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతుంటారు. గంగోత్రికి వెళ్లే మార్గంలో భక్తులు ఎక్కువగా బస చేసే ప్రాంతం ధారాలీ.

ఈ ధారాలీని మెరుపు వేగంతో మంగళవారం రోజు వరదలు ముంచెత్తాయి. ఊరికి ఊరు వరదల్లో తుడిచిపెట్టుకుపోయింది. అక్కడున్న హోటళ్లు, ఇళ్లు నామరూపాలు లేకుండా పోయాయి. సోమవారం రాత్రి ఎంతో ఆహ్లాదంగా కనిపించిన ఆ ప్రాంతం మంగళవారం సాయంత్రానికి వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్లు, హోటళ్లు.. శిథిలాలకు సాక్ష్యంగా నిలిచింది. గంగోత్రి-యమునోత్రికి వెళ్లే భక్తులను రోజు పరిమితి ముగిసిన తర్వాత తెహ్రీ, చంబా, ఉత్తరకాశీలో నిలిపివేస్తారు. 

ALSO READ | కాశీలో పడవల్లోకి పాడెలు.. మిద్దెలపై శవ దహనాలు ! గంగమ్మకు కోపమొస్తే ఇట్టుంటదా..?

ఈ పట్టణాల్లో ఒకేసారి 20 నుంచి 30 వేల మంది బస చేయగలుగుతారు. ఇక్కడ హోటల్, హోమ్ స్టే సౌకర్యాలు ఉన్నాయి. ఇలా ఉత్తరకాశీలో భక్తులు బస చేసే ప్రాంతమే ఈ ధారాలీ. వరదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు భారత జవాన్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వరదతో పాటు భారీ వర్షం కూడా సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. 80 మందిని SDRF టీం రక్షించింది.