కీలక పోస్టుకు వీవీఎస్‌‌ను ఒప్పించిన దాదా

కీలక పోస్టుకు వీవీఎస్‌‌ను ఒప్పించిన దాదా

ముంబై: నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. లక్ష్మణ్ ఎన్‌సీఏ హెడ్‌గా బాధ్యతలు స్వీకరిస్తారా లేదా అని ఓ వార్తా సంస్థ గంగూలీని ప్రశ్నించగా.. “అవును” అని ఆయన సమాధానం చెప్పాడని తెలుస్తోంది. ఎన్‌సీఏ చీఫ్‌గా బాధ్యతలు తీసుకోవాల్సిందిగా లక్ష్మణ్‌కు బీసీసీఐ పెద్దలు ఆఫర్ చేశారని.. కానీ ఆయన నో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు లక్ష్మణ్‌ను దాదా ఒప్పించారని టాప్ బీసీసీఐ అధికారి చెప్పారు.

బీసీసీఐలో సీనియర్ ప్లేయర్లు ఉంటేనే కొత్త ఆటగాళ్లను గుర్తించడం, వారిని సానబెట్టడం, టీమిండియాకు ఆడేలా తీర్చిదిద్దడం సులభమవుతుందని గంగూలీ నమ్ముతారని క్రికెట్ వర్గాలు చెబుతుంటాయి. ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్‌గా ఉండడానికి ద్రవిడ్‌ను  ఒప్పించిన దాదా.. ఎన్‌సీఏ హెడ్‌ పోస్టుకు లక్ష్మణ్‌‌ను కన్విన్స్ చేయడం విశేషం. ఇండియా ఏ టీమ్ సౌతాఫ్రికా టూర్ ముగిసిన తర్వాత వీవీఎస్ పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఇకపోతే, ఎన్‌సీఏ హెడ్‌గా ఛార్జ్ తీసుకోవడానికి ముందు.. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మెంటార్‌ పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. అలాగే కామెంట్రీతోపాటు ఇతర మీడియా కమిట్‌మెంట్ల నుంచి కూడా ఆయన వైదొలగాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తల కోసం: 

గోమూత్రంతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం

అబ్బాయిలకూ లైంగిక వేధింపులు తప్పడం లేదు

రాజకీయాల్లోకి సోనూ సూద్ సోదరి