నేషనల్ క్రష్ రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా రూపొందిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ (TheGirlFriend). నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. అను ఇమ్మాన్యుయేల్ కీలక పాత్రలో కనిపించింది. నవంబర్ 7న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ సందర్భంగా గర్ల్ ఫ్రెండ్ మేకర్స్ బుధవారం (నవంబర్ 12న) సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇపుడు ఈ విజయోత్సవ సభ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందుకు కారణం రూమర్స్ లవర్స్గా సెన్సేషనల్ అయిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒకే వేదికపై ఉండటం, ఒకరిగురించి మాట్లాడటం. అంతేకాకుండా.. రష్మిక చేతికి విజయ్ ముద్దుపెట్టడం. అలా పూర్తి సక్సెస్ మీట్ వివరాల్లోకి వెళితే..
విజయ్, రష్మిక ప్రేమాయణం గురించి రూమర్లు ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. 'గీత గోవిందం' ,'డియర్ కామ్రేడ్' చిత్రాలలో కలిసి నటించిన ఈ జంట ఎన్నో త్వరలో పెళ్లి చేసుకోవబోతున్నారనే వార్తా కూడా వినిపిస్తోంది. అయితే, ఈ జంట మాత్రం ఇన్ డైరెక్ట్ హింట్స్ ఇస్తున్నారే తప్ప, తమ పెళ్లిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ తరుణంలోనే విజయ్-రష్మిక గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ మీట్తో ఒకే స్టేజిపై కనిపించి ఆశ్చర్యపరిచారు. గర్ల్ ఫ్రెండ్ విజయోత్సవ సభకు విజయ్ దేవరకొండ గెస్ట్గా అటెండ్ అయ్యారు.
ఈ క్రమంలో సక్సెస్ మీట్‌లో అనూహ్య సన్నివేశం చోటు చేసుకుంది. విజయ్ దేవరకొండ పబ్లిక్‌లోనే రష్మిక చేతిని ముద్దు పెట్టాడు. ఈ సన్నివేశం చూసిన ప్రేక్షకులు ఖుషి అవుతూనే స్టన్ అయ్యారు. కేరింతలు, చప్పట్లతో ఆడిటోరియం అదరగొట్టారు. ఆ టైంలో రష్మిక కూడా స్మైల్ ఇస్తూ సిగ్గుపడటం ఇరువురు ఫ్యాన్స్ని మరింత ఆకట్టుకుంది. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలో మొత్తం మీద ‘ గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ మీట్ తో రష్మిక-విజయ్ దేవరకొండల రొమాంటిక్ రూమర్ బయటపడిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
సక్సెస్ మీట్ లో రష్మిక మాట్లాడుతూ..‘ విజయ్ దేవరకొండ మొదట్నుంచీ నా లైఫ్లో పార్ట్ అయ్యావ్. ప్రతీ ఒక్కరి లైఫ్‌లో విజయ్ దేవరకొండ ఉండటం బ్లెస్సింగ్ లాంటిది’ అని రష్మిక తనదైన శైలీలో మాట్లాడి ప్రేమను వ్యక్తపరిచింది.
ఈ క్రమంలో సినిమా గురించి మాట్లాడుతూ.. ‘బయట ఉన్న భూమా, దుర్గ, అమ్మలు అందరికీ బిగ్ హగ్.. భూమా లైఫ్‌లో కొన్ని సంఘటనలు జరిగాయి. జరిగేటప్పుడు ఇది నా మిస్టేక్ అనిపించేది. ఈ స్క్రిప్ట్ చదివినపుడు అబ్బాయి అయ్యుండి అమ్మాయిల మనసు ఎలా తెలుసుకున్నారు అనిపించేది రాహుల్ గురించి. ఒక సైడ్‌లో ఆనందంగా ఉన్నా.. మరో సైడ్‌లో బాధ అనిపిస్తుంది.. ఇంత బాధ ఎలా బయటికి తీయొచ్చనేది నాకు అర్థం అవ్వట్లేదు. ఆడియన్స్‌కు థ్యాంక్యూ. ఫస్ట్ టైమ్ డైరెక్టర్‌కు సరెండర్ అయిపోయి నటించాను. దీక్షిత్ లాంటి అబ్బాయి అమ్మాయిలందరికీ కావాలి. డైరెక్టర్ రాహుల్ కి బిగ్ థ్యాంక్యూ..’ అని రష్మిక చెప్పుకొచ్చింది.
అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..‘‘రష్మికను గీతా గోవిందం అప్పట్నుంచి చూస్తున్నా.. నిజంగా తానొక భూమా దేవియే. సెట్ మీద అంతా హ్యాపీగా ఉండాలని చూస్తుంటుంది. పక్క వాళ్ల హ్యాపీనెస్ కోసం చూస్తుంది. పీక్ కెరీర్‌లో ఇలాంటి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం ఆమె ఏంటో చూపిస్తుంది. రష్మిక నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంటుంది నాకు.
ఎందుకంటే, నన్ను ఎవడైనా గెలికితే రివర్స్‌లో వెళ్తా.. రష్మిక మాత్రం చాలా కైండ్‌గా ఉంటుంది. ఎవ్వరితో ఎటువంటు సంబంధం లేకుండా తన పని తను చేసుకుంటుంది. ఒకరోజు ప్రపంచం ఏంటో నన్ను చూస్తుంది అని నమ్ముతుంది.. అదే జరిగిందని నమ్ముతున్నా. అందరం తప్పులు చేస్తాం. చావు పుట్టుక తప్ప మిగిలిన దాంట్లో అన్నింట్లోనూ మనకు ఛాయిస్ ఉంటుంది. చిన్న లైఫ్ మనది.. హ్యాపీగా ఉండాలి కానీ కాంప్లికేటెడ్‌గా ఉండొద్దు’’ అని విజయ్ చెప్పుకొచ్చారు.
నాలుగేళ్ల రహస్య ప్రేమాయణం:
విజయ్ దేవరకొండ, రష్మిక తొలిసారిగా 'గీత గోవిందం' (2018) సినిమాలో జంటగా నటించారు. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' (2019)లో నటించారు. ఈ రెండు సినిమాల్లో వారి కెమిస్ట్రీ అద్భుతంగా పండడంతో, తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ వీరి మధ్య ఏదో ఉందని సినీ విశ్లేషకులకులతో పాటు అభిమానుల్లో ఒక అంచనాకు వచ్చారు.
ప్రస్తుతం ఈ జంట ట్యాక్సీవాలా' డైరెక్టర్ రాహుల్ సంక్రిత్యాన్.. విజయ్తో మరో మూవీ చేస్తున్నారు. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో విజయ్ కి జోడీగా రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. 1870 టైమ్‌లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ స్టోరీతో సినిమా తెరకెక్కుతుంది.
Epics are not written, they are etched in the blood of heroes ⚔️
— Mythri Movie Makers (@MythriOfficial) May 9, 2024
Presenting #VD14 - THE LEGEND OF THE CURSED LAND 🔥
Happy Birthday, @TheDeverakonda ❤️🔥
Directed by @Rahul_Sankrityn
Produced by @MythriOfficial pic.twitter.com/FVorlWkLmd
