పోలీసుల అదుపులో దూబే భార్య, కొడుకు

పోలీసుల అదుపులో దూబే భార్య, కొడుకు

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ వికాస్ దూబే యొక్క భార్య మరియు కొడుకును గురువారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దూబే నేరాల గురించి వారిని ప్రశ్నించనున్నారు. గురువారం సాయంత్రం లక్నోలోని క్రిష్ నగర్ ప్రాంతంలో ఒక మహిళ మరియు ఒక బాలుడు పొలంలో కూర్చొని ఏడుస్తుండటం స్థానికులు గమనించారు. వారిద్దరూ దూబే భార్య మరియు కొడుకుగా గుర్తించి.. పోలీసులకు సమాచారమిచ్చారు. దాంతో పోలీసులు అక్కడకు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు.

గత శుక్రవారం తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై తన అనుచరులతో కలిసి కాల్పులు జరిపిన వికాస్ దూబే ఎనిమిది మంది పోలీసుల చావుకు కారణమయ్యాడు. వారిని హతమార్చిన తర్వాత దూబే.. కాన్పూర్ నుంచి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి పారిపోయాడు. తన అనుచరులను పోలీసులు ఎన్ కౌంటర్ ద్వారా హతమారుస్తుండటంతో.. తనను కూడా ఎన్ కౌంటర్ చేస్తారని దూబే భయపడ్డాడు. గురువారం ఉదయం మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహంకాళీ గుడిలో పోలీసులకు చిక్కాడు. అతన్ని శుక్రవారం ఉదయం కాన్పూర్ తీసుకొస్తుండగా.. కారు ప్రమాదం జరిగి బోల్తా పడింది. ఆ సమయంలో దూబే తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో.. పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దూబే అక్కడికక్కడే మృతిచెందాడు. వికాస్ దూబే దాదాపు 60కి పైగా కేసుల్లో నిందితుడు.

సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ దూబే అరెస్టు పై స్పందించారు. దూబే తనకు తాను లొంగిపోయాడా లేదా పోలీసులు అరెస్టు చేశారా అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని ఆయన ట్వీట్ చేశారు.

For More News..

హెల్త్‌‌ పాలసీలకు మస్త్‌‌ డిమాండ్

కరోనా పేషంట్ బతికుండగానే చనిపోయాడంటూ..

ప్రభుత్వంలో 10 వేల మంది ఉద్యోగాలు ఊస్ట్

సెక్రటేరియట్ శిథిలాల ట్రాన్స్ పోర్టుకే రూ. 15 కోట్లు!