సోనమ్ వాంచుక్‌‌తో విశాక ఇండస్ట్రీస్ దోస్తీ

సోనమ్ వాంచుక్‌‌తో విశాక ఇండస్ట్రీస్ దోస్తీ
  • లడఖ్‌‌లో సోలార్ బ్యాటరీ హౌస్ ప్రాజెక్ట్ 

హైదరాబాద్, వెలుగు : లడఖ్‌‌లో పైలట్ సోలార్ బ్యాటరీ హౌస్ ప్రాజెక్ట్‌‌ కోసం విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఎడ్యుకేషన్ రీఫార్మర్ సోనమ్ వాంచుక్‌‌తో జత కట్టింది. ఈ సోలార్ బ్యాటరీ హౌస్‌‌పై ఆటమ్​ పానల్స్​తో రూఫ్​టాప్​ ఏర్పాటు చేస్తారు. ఎల్లప్పుడూ అతి చల్లగా ఉండే లడఖ్‌‌లో ఇండియన్ ఆర్మీకి ఇది నివాసంగా కూడా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ సోలార్ రూఫింగ్ సొల్యుషన్స్‌‌ను విశాక ఇండస్ట్రీస్ డెవలప్‌‌ చేస్తోంది.  సంప్రదాయ సోలార్ ప్యానల్స్‌‌తో పోలిస్తే 20 శాతం ఎక్కువ ఇన్‌‌స్టాల్డ్ కెపాసిటీని ఆటమ్ ప్యానల్స్ అందిస్తాయి.  ఈ ప్రాజెక్ట్ కోసం 1.3 కిలోవాట్స్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేసేందుకు నాలుగు ఆటమ్ ప్యానల్స్‌‌ను విశాక ఇండస్ట్రీస్ అందించింది. రెండు రోజుల్లో దీని ఏర్పాటు పూర్తి చేస్తారు. ఈ హౌస్ గోడలను మట్టితో తయారు చేస్తారు. ఇది కేవలం సోలార్ రూఫ్ మాత్రమే కాదని, ఈ సోలార్‌‌‌‌ రూఫ్స్​ తమ సాయుధ దళాలకు షెల్టర్స్‌‌ కూడా అవుతాయని సోమన్ వాంచుక్‌‌ చెప్పారు. మన సాయుధ దళాలకు కంటిన్యూగా రెన్యూవబుల్ ఎనర్జీని అందించడమే ఆటమ్స్ లక్ష్యమని విశాక ఇండస్ట్రీస్​ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గడ్డం అన్నారు.  భవిష్యత్‌‌ అవసరాల్లో సోలార్​ బ్యాటరీ హౌస్  ముఖ్యమైనదిగా మారనుంది.