మోడీ ప్రభుత్వం చొరవతోనే మణిపూర్ అభివృద్ధి

మోడీ ప్రభుత్వం చొరవతోనే మణిపూర్ అభివృద్ధి

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై కాంగ్రెస్ ఏనాడూ దృష్టి పెట్టలేదన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. కాంగ్రెస్ వైఖరిని తప్పుబడుతూ ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గడ్కరీ మణిపూర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. స్వాతంత్ర్యం వచ్చిన అనేక ప్రభుత్వాలు ఏర్పాటైనా అవేవీ ఈ ప్రాంతాలను పట్టించుకోలేదని చెప్పారు. మోడీ నేతృత్వంలోని సర్కారు తొలిసారి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిపై దృష్టి సారించిందని అన్నారు. బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకమని కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న గడ్కరీ.. తమ పార్టీ జాతి, మతం, కులం, లింగ బేధాలు చూడదని చెప్పారు. భారతీయులంతా ఒక్కటే అని భావిస్తుందని, పేదరిక నిర్మూలనకు పోరాటం చేస్తోందని అన్నారు. 

మణిపూర్ ప్రచార సభలో నితిన్ గడ్కరీ వస్త్రధారణ అందరినీ ఆకట్టుకుంది. సంప్రదాయ మణిపూరీ వేషధారణలో ఆయన కనిపించారు. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 28న తొలివిడత పోలింగ్ జరగనుండగా.. మార్చి 5న రెండో దశ ఓటింగ్ నిర్వహించనున్నారు. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. 

మరిన్ని వార్తల కోసం..

ప్రపంచ చెస్ టోర్నీలో భారత టీనేజర్ సంచలనం

ఏడేండ్లలోనే కోటి ఎక‌రాల మాగాణిగా తెలంగాణ‌