సమ్మర్ బ్రేక్‌ఫాస్ట్: ఈ ఎండలను తట్టుకోవడానికి ఉదయం ఏం బ్రేక్‌ఫాస్ట్ తినాలి?

 సమ్మర్ బ్రేక్‌ఫాస్ట్: ఈ  ఎండలను తట్టుకోవడానికి ఉదయం ఏం బ్రేక్‌ఫాస్ట్ తినాలి?

వేసవి కాలంలో ఉదయాన్నే నీరసంగా అనిపించడం చాలా సహజం. పెరుగుతున్న ఎండల వల్ల చాలామంది ఉదయం పూట తిండిని సరిగ్గా తినరు లేదా అస్సలు తినడమే మానేస్తుంటారు. కానీ, పోషకాహార నిపుణుల ప్రకారం.. ఎండలను తట్టుకోవడానికి, శరీరానికి శక్తి, నీరు అందడానికి వేసవిలో అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) చాలా ముఖ్యం. ఈ వేసవిలో మీరు రోజంతా ఉత్సాహంగా ఉండటానికి ఎలాంటి అల్పాహారం తీసుకోవాలో చూద్దామా....

 వేసవిలో అల్పాహారం ఎందుకు ముఖ్యం?
ఎండల వల్ల చెమట రూపంలో ఒంట్లోని నీరు బయటకు పోయి అలసట, నీరసం వస్తాయి. కెల్లాగ్ ఇండియా నిపుణురాలు ప్రకారం.. వేసవిలో మనం తినే అల్పాహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు ఇంకా ద్రవపదార్థాలు (Water content) బ్యాలెన్స్ గా ఉండాలి.

 సమ్మర్ బ్రేక్‌ఫాస్ట్ ఫార్ములా
ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ అంటే పెద్దగా కష్టపడక్కర్లేదు. ఈ సింపుల్ ఫార్ములా పాటిస్తే చాలు:

1తృణధాన్యాలు (Whole grains) + పాలు/పెరుగు + తాజా పండ్లు

2. ధాన్యాలు: ఇవి శరీరానికి రోజంతా కావాల్సిన శక్తిని ఇస్తాయి.

3.పాలు లేదా పెరుగు: వీటి వల్ల కండరాలు, ఎముకలకు బలాన్నిచ్చే ప్రోటీన్, కాల్షియం, విటమిన్ బి12 అందుతాయి.

 ఫైబర్ (పీచు పదార్థం)  
వేసవిలో జీర్ణక్రియ బాగుండటానికి పీచు పదార్థం చాలా అవసరం. తృణధాన్యాలు తినడం వల్ల కడుపు నిండినట్లు ఉండి, అనవసరమైన జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. ఇది పేగుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

 సీజనల్ పండ్లు
వేసవిలో దొరికే పండ్లను మీ అల్పాహారంలో చేర్చండి. మామిడి, అరటి, బొప్పాయి, పుచ్చకాయ, బెర్రీలు వంటి పండ్లలో విటమిన్లు, ఫైబర్ ఇంకా సహజమైన తీపి ఉంటాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరం డీహైడ్రేషన్ (ఎండదెబ్బ) బారిన పడకుండా ఉంటుంది.

►ALSO READ | మీ భర్త వయసు 34 నుంచి 35 ఏండ్లా.. పిల్లలు పుట్టడం లేదా..? అయితే మెయిన్ రీజన్ ఇదే..!

ఉదయాన్నే ద్రవపదార్థాలు 
రాత్రంతా నిద్రపోవడం వల్ల శరీరంలో తగ్గిన నీటి శాతాన్ని ఉదయమే భర్తీ చేయాలి. అల్పాహారంలో పాలు, పెరుగు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. మీ రోజును ఒక గ్లాసు మంచి నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసంతో ప్రారంభించడం వల్ల శరీరం చల్లబడి, ఎండను తట్టుకోవడానికి సిద్ధమవుతుంది.
 
వేసవి అల్పాహారం ఎప్పుడూ తేలికగా, సింపుల్ గా ఉండాలి. భారీగా ఉండే ఆహారాలు తిని నీరసపడటం కంటే.. తృణధాన్యాలు, పెరుగు, పండ్ల లాంటి చల్లని, పోషకమైన కాంబినేషన్లను తీసుకోండి. సరైన అల్పాహారంతో  వేసవి రోజులను హ్యాపీగా, హెల్తీగా మార్చుకోండి!