
హైదరాబాద్ సిటీలో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు జోరుగా సాగుతోంది.. సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, ఛత్తీస్ గఢ్, కర్ణాటక లనుంచి గంజాయి తీసుకొచ్చి సిటీలో అమ్ముతున్నారు. పోలీసులు నిఘాపెట్టి తనిఖీ చేస్తూ గంజాయి రవాణ, విక్రయాలను అడ్డుకుంటున్నప్పటికీ గంజాయి దందా మాత్రం ఆగడం లేదు. గురువారం ( సెప్టెంబర్25) ఛత్తీస గఢ్ నుంచి హైదరాబాద్ కు మోటారు బైక్ పై గంజాయి తరలిస్తుండగా రంగారెడ్డి జిల్లా ఆగపల్లి దగ్గర పోలీసులు పట్టుకున్నారు.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి దగ్గర గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి తరలిస్తున్న ఛత్తీస్ గఢ్ కు చెందిన ప్రమోద్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గర నుంచి 1కేజీ గంజాయిని పట్టుకున్నారు. మరో వ్యక్తి ఒడిషాకు చెందిన కిరణ్ నాయక్ పరారీలో ఉన్నాడు. నిందితుడు ప్రమోద్ ను మంచాల పోలీసులకు అప్పగించారు ఎస్ వోటీ పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
►ALSO READ | కీసర కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన శ్వేత భర్త కుటుంబ సభ్యులు