‘హాలీవుడ్‌‌‌‌‌‌‌‌’కు కార్చిచ్చు సెగ

‘హాలీవుడ్‌‌‌‌‌‌‌‌’కు కార్చిచ్చు సెగ

అమెరికాలోని కాలిఫోర్నియాలో రేగిన కార్చిచ్చు.. ‘హాలీవుడ్‌‌‌‌’ స్టార్లు, సెలబ్రిటీల ఇళ్లనూ తాకింది. వందల కోట్ల విలువైన ఇళ్లను బుగ్గి చేసేస్తోంది. దీంతో స్టార్లు, సెలబ్రిటీలు, డబ్బున్నోళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేరే చోటుకు తరలిపోతున్నారు.  అసలే పొడి వాతావరణం, పైగా గంటకు 164 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో మంటలు కాలిఫోర్నియా నుంచి పక్క ప్రాంతాలకూ విస్తరిస్తున్నాయి. ఈ అగ్నికీలలు తాజాగా లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏంజెలెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నూ తాకాయి. హాలీవుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెలబ్రిటీలు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, ఫుట్‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లు, మీడియా సంస్థల అధినేతలు, సంపన్నులుండే బ్రెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వుడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వ్యాపించాయి. అర్ధరాత్రి మంటలు చెలరేగడంతో సెలబ్రిటీలు ఇండ్ల నుంచి పరుగులు తీశారు. అగ్నికీలల ధాటికి రూ. వందల కోట్ల విలువైన 5 ఇండ్లు పూర్తిగా నాశనమయ్యాయి. ఫేమస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాస్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిబ్రోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటికి తెల్లవారుజామున నిప్పంటుకోవడంతో భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఇంట్లోంచి బయటకు పరుగు తీశారు.

8 బెడ్రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లున్న ఆ ఇంటిని జేమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 2017లో రూ.162 కోట్లకు కొన్నారు. వేలాది మందితో కలిసి తాను పొద్దుపొద్దున్నే పరుగులు తీయాల్సి వచ్చిందని కాలిఫోర్నియా మాజీ గవర్నర్, యాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్నాల్డ్ కూడా ట్వీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కార్చిచ్చు కారణంగా సోమవారం జరగాల్సిన ఆర్నాల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నటించిన ‘టెర్మినేటర్.. డార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ సినిమా ప్రీమియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాయిదా పడింది. హెలికాప్టర్లు, విమానాల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కాలిఫోర్నియాలోని సొనోమా కౌంటీలోని కిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అడవిలో గత బుధవారం అర్ధరాత్రి రాజుకున్న మంటలు ఇప్పటికే 54 వేలకు పైగా ఎకరాలకు విస్తరించాయి. భూమార్గంతో పాటు హెలికాప్టర్లు, విమానాలతోనూ నీళ్లు చల్లుతున్నా 5 శాతమే మంటలు అదుపులోకి వచ్చాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గావిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూసమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. కిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శాంటారోసా, సొనోమాల్లోని 2 లక్షల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి