పాదాలను 180డిగ్రీలు తిప్పింది.. గిన్నిస్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది

పాదాలను 180డిగ్రీలు తిప్పింది.. గిన్నిస్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టింది

న్యూ మెక్సికోలోని అల్బుకెర్కీకి చెందిన 32 ఏళ్ల కెల్సీ గ్రబ్.. తన పాదాలను 171.4 డిగ్రీలు అంటే దాదాపు 180 డిగ్రీలు తిప్పుతూ... గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టింది. 2021లో తన సహోద్యోగి ప్రపంచ రికార్డు పుస్తకంలోని ఓ విచిత్రాన్ని చూపించడంతో కెల్సీకి కూడా తన ప్రతిభను నిరూపించుకోవాలనకుంది. వెంటనే ఆమె తన పాదాలను తిప్పడానికి ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నం ఏదో ఒక రోజు రికార్డును బద్దలు కొడుతుందని ఊహించలేకపోయింది.

కెల్సీ.. దీని కోసం అంతగా ఏం ప్రాక్టీస్ చేయలేదు. కనీసం రికార్డ్ కోసం కూడా ప్రయత్నించలేదు. కానీ ఆమెకు ఉన్న ఫిగర్ స్కేటింగ్ అనుభవంతో ఈ రికార్డు సాధించడం సులభంగా మారింది. ఈ ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఆమెకు కొన్నిసార్లు మోకాలిలో కొంచెం అసౌకర్యం కలిగినా.. ఆమె దాన్నేం పట్టించుకోలేదు. దానికి కోడు ఐస్-స్కేటింగ్ లో తనకున్న అనుభవం దీనికి బాగా ఉపయోగపడింది. అలా ఆమె తన శరీరాన్ని కదల్చకుండా.. కేవలం పాదాలను మాత్రమే దాదాపు 180 డిగ్రీలలో తిప్పే ప్రతిభను సొంతం చేసుకుంది.

ఆమె టాలెంట్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. కొందరు స్నేహితులు, సన్నిహితులు ఇచ్చిన సలహాతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు దరఖాస్తు చేసుకుంది. అలా ఆమె ఎప్పుడూ ఊహించని ఖ్యాతిని సాధించి రికార్డు సొంతం చేసుకుంది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.