​టాయ్ ట్రైన్ బోగీలో చిక్కుకొని మహిళ మృతి

​టాయ్ ట్రైన్ బోగీలో చిక్కుకొని మహిళ మృతి

కాన్పూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ నగరంలో ప్రమాదం జరిగింది. టాయ్ ట్రైన్ బోగీలో ఇరుక్కుపోయి ఓ మహిళ చనిపోయింది. మంజూ శర్మ అనే మహిళ ఫ్యామిలీతో కలిసి సరదాగా జూకి వెళ్లింది. జూలో టాయ్ ట్రైన్ ఎక్కిన మంజూశర్మ  ప్రమాదవశాత్తూ ట్రైన్ బోగీలో చిక్కుకుంది. పక్కనున్న వారు గుర్తించి కేకలు వేసి ట్రైన్ నిలిపేశారు. తీవ్రంగా గాయపడిన మంజుశర్మ అనే మహిళ మృతి చెందింది.

ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జూ సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దానిపై ఆరా తీశారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని నడిపే టాయ్ ట్రైన్ లో ప్రమాదం జరగడం దిగ్భ్రాంతికి గురి చేసింది. ఘటనపై  కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.