రెండు గంటల పాటు ఫ్లైట్లో నరకం... మహిళ చేసిన పనికి అంతా షాక్

 రెండు గంటల పాటు ఫ్లైట్లో నరకం... మహిళ చేసిన పనికి అంతా షాక్

ఎవరు అడ్డుకున్నా ఆ పనులను అసలు ఆపలేరు.. కొంత సేపే ఓపిక పట్టగలరు... మరీ ఎక్కువ సేపయితే అక్కడే ఆ పని కానిచ్చేస్తారు... అది ఎలాంటి ప్రదేశమైనా.. ఎంతమంది ఉన్నా...ఆలోచించరు.. ఇప్పుడు అలాంటి పనే ఓ మహిళ విమానం ఫ్లోర్ మీద కానిచ్చేసింది.... వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానంలో ఓ మహిళను టాయిలెట్‌కు వెళ్లకుండా అడ్డుకున్నారు అందులోని ఫ్లైట్ అటెండెంట్లు. రెండు గంటల పాటు ఓపిక పట్టింది..  ఎంతసేపు ఆపుకుంటుంది... ఇక ఆపుకోలేక విమానం ఫ్లోర్ మీదే మూత్రవిసర్జన చేసింది. క్యాబిన్ క్రూ బృందంలోని ఒకరు ఈ ఉదంతాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

విమానాల్లో మలమూత్ర విసర్జనకు టాయిలెట్లు ఉంటాయి. అయినా కొందరు తింగరి మనుషులు తాము కూడా టాయిలెట్లలో పోస్తే వెరైటీ ఏముంటుందని సీట్ల దగ్గరే పని కానిస్తున్నారు. కొందరు మద్యం మత్తులో పక్కనున్న ప్రయాణికులను తడిపేస్తున్నారు. ఈ వ్యవహారాలు కేసులు, జరిమానాల దాకా వెళ్తున్నాయి. కొందరిది పైత్యమైతే కొందరిదేమో ఆపుకోలేని యమ అర్జెంట్. మూత్రాన్ని బిగబట్టుకోలేక ఓ మహిళ బాత్రూంలో కాకుండా  బయటే పోసింది. అమెరికాకు చెందిన స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానం దీనికి వేదికైంది. సిబ్బంది ఎంతకూ బాత్రూం తలుపు తీయకపోవడంతో బయటే పోయాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. జులై 20న స్పిరిట్ ఎయిర్ లైన్స్ విమానంలో ఆఫ్రికన్ అమెరికా మహిళ తనకు టాయిలెట్ అర్జెంటని అక్కడి సిబ్బందితో చెప్పింది.  అయితే  ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే అనుమతించడం కుదరదని చెప్పారు.

 ‘‘రెండు గంటల నుంచి మొత్తుకుంటున్నాను. అయినా టాయిలెట్ తలుపు తెరవలేదు. అందుకే కానిచ్చేశా. ఏం చేసుకుంటారో చేసుకోండి. అరెస్ట్ చేస్తారో, జైల్లో వేస్తారో వేసుకోండి. తప్పు నాది కాదు, నాతో ఈ పని చేయించిన మీరే’’ అని ఆమె గరమైంది. ఆ సంఘటలను విమాన సిబ్బంది వీడియో తీశారు. మీ మూత్రం దుర్వాసన వస్తోంది, ముందు మంచినీళ్లు తాగండి అని సిబ్బందిలో ఒకరు చెబుతున్నట్లు వీడియోలో ఉంది. ఆమెను ఎందుకు రెస్ట్ రూంలోకి అనుమతించలేదో తెలియడం లేదు. ఆమె మూత్రం పోస్తుండగా వీడియో తీయడం సరికాదని సిబ్బందిపై విమర్శలు వస్తున్నాయి. వీడియో వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు ఇష్టానుసారంగా స్పందిస్తున్నారు. 

ఫ్లైట్ సిబ్బంది తీరు అమానుషమని కొందరంటే.. మా పెంపుడు పిల్లి చాలా శుభ్రాన్ని పాటిస్తుందని మరొకరు కామెంట్ చేశారు. ఎవరో ఏదో అన్నారని కాదుగానీ టాయిలెట్ విషయంలో ఇరుపక్షాల్లో నిర్లక్ష్యం సరికాదని ఎక్కువమంది స్పందిస్తున్నారు.