
కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు భయాందోళనకు గురవుతున్నాయి. వైరస్ చైనాలో మొదలై.. ఒక్కొక్క దేశాన్ని తాకుతూ దాదాపు 116 దేశాలకు విస్తరించింది. అన్నీరంగాలు భారీగా నష్టపోతున్నాయి. ఆయా దేశాదిపతులు వైరస్ కు విరుగుడు కనిపెట్టేలా ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు. ఆ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వైరస్ ను అరికట్టే వ్యాక్సిన్ లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలియక ప్రజలు అందోళనకు గురవుతున్నారు. ఈ ఆందోళన వైరస్ ప్రభావిత దేశాల్లో ఎక్కువగా ఉంది.
వైరస్ సోకితే ఏం చేయాలి
వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏదైనా అవసరం ఐతే తప్పా భయటకు రావొద్దని అంటున్నారు సియాటెల్‌కు చెందిన ఎలిజబెత్ స్నైడర్. ఇటీవల స్నైడర్ కు కరోనా సోకింది. వారం రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకొని వైరస్ నుంచి భయటపడినట్లు తెలిపారు.
పార్టీలో పాల్గొన్న
బయో ఇంజినీరింగ్ లో పీహెచ్ డీ చేస్తున్న తాను ఫ్రిబవరి 22న జరిగిన పార్టీలో పాల్గొన్నట్లు తెలిపారు. పార్టీ జరిగిన మూడు రోజుల తరువాత విపరీతమైన జ్వరం, ఒళ్లు నొప్పులు. జ్వరం ఎక్కువయ్యే సరికి వైద్యుల్ని సంప్రదించాను. అదే సమయంలో పార్టీలో పాల్గొన్న 40మందకి వైరస్ సోకిందని వార్తలు రావడంతో ఆందోళనకు గురైనట్లు చెప్పారు.
టెస్ట్ తో కరోనా సోకినట్లు గుర్తించా
జ్వరం ఎక్కువగా ఉందని డాక్టర్లకు చెబితే కరోనా టెస్ట్ లు చేశారు. ఆ సమయంలో లంగ్స్ కానీ, ఊపిరితిత్తుల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకపోవడంతో కరోనా ఎలా సోకుతుందని అనుకున్నాను. కానీ టెస్ట్ ల్లో కరోనా సోకిందని తేలింది. ఇంట్లో వాళ్లందరు భయపడ్డారు.
వారం రోజుల్లో వైరస్ తగ్గింది
ఇంట్లో వాళ్లు భయపడ్డా నాకు మాత్రం భయంగా లేదు. ఇంట్లో వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉన్నా. డాక్టర్ల సలహాలు, ధైర్యంతో వైరస్ నుంచి భయటపడ్డానని ఎలిజబెత్ స్నైడర్ తెలిపింది. వైరస్ సోకిన వ్యక్తులు ప్రధానంగా ధైర్యంగా ఉండాలని చెప్పారు. ధైర్యంగా ఉంటే కరోనా తగ్గుముఖం పడుతుందని వివరించారు.
ప్రజలకు సలహా
కరోనా వైరస్ పట్ల ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని స్త్నైడర్ తెలిపింది. తప్పని సరిగా ఉంటే తప్పా ఇంట్లో నుంచి భయటకు రావొద్దని చెప్పారు.
more news