విశాఖలో కార్మికుల ఉద్యమం ఉధృతం

విశాఖలో కార్మికుల ఉద్యమం ఉధృతం

విశాఖ ఉక్కు ఉద్యమం ఉధృతంగా కొనసాగుతోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న పోరాటం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో కార్మికులు  జైలో భరోకార్యక్రమాన్ని చేపట్టారు. కూర్మన్నపాలెం ఆర్చి వద్ద నుంచి గాజువాక వరకు ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల నిరసనలో సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం


దేశం ఎవని అయ్య సొత్తు కాదు

భారీగా తగ్గిన కొవిడ్ కేసులు