మంచి నిద్ర కోసం ఈ టిప్స్ పాటించండి

మంచి నిద్ర కోసం ఈ టిప్స్ పాటించండి

‘‘ఆకలి రుచెరుగదు.. నిద్ర సుఖమెరుగదు’’ అనేది పాత రోజుల్లో సామెత. కానీ ఇప్పటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సుఖవంతమైన బెడ్స్, కూల్ ఏసీలు.. ఇంకా ఎన్నెన్ని సౌకర్యాలు ఉన్నా సరే మంచి నిద్ర పట్టక కిందామీదా అయ్యే వాళ్లు  ఇంటింటికీ ఉన్నారిప్పుడు. పడుకున్న తర్వాత క్షణాల్లో హాయిగా నిద్రలోకి జారుకునే వాళ్లు ఎక్కడో నూటికో కోటికో ఒకరుంటే.. అర్ధ రాత్రి వరకూ దొర్లితే కానీ నిద్ర పట్టక ఇబ్బందిపడుతున్నవారికి మాత్రం కొదవే లేదు. ఆ పట్టిన నిద్ర అయినా మంచి గాఢ నిద్ర అయితే ఫర్లేదు.. కానీ కొంత మందికి అలలు అలలుగా.. నిద్ర వస్తూ పోతూ ఉంటుంది. మరికొందరికి గురక సమస్య.. ఇంకొందరికి మెంటల్ టెన్షన్స్ తో నిద్ర సరిగా ఉండదు. ఇలా నిద్ర సమస్యల కారణంగా అనారోగ్యం బారినపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. వీటిపై అవగాహన పెంచాలన్న ఉద్దేశంతోనే ఏటా మార్చి 18న వరల్డ్ స్లీప్ డే జరుపుకోవడం మొదలైంది. పలు దేశాలకు చెందిన డాక్టర్లు.. వరల్డ్ స్లీప్ సొసైటీ అనే పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేసి.. 2008లో తొలిసారి వరల్డ్ స్లీప్ డేను నిర్వహించారు.

మంచి నిద్ర ఉంటేనే..

మంచి నిద్ర ఇంపార్టెన్స్ పై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో వరల్డ్ స్లీప్ సొసైటీ డాక్టర్లు ఈ రోజును వరల్డ్ స్లీప్ డేగా నిర్వహిస్తున్నారు. నిద్ర లేమి వల్ల రోజు వారీ జీవితంలో వచ్చే సమస్యలను తెలియజేయంతో పాటు మంచి నిద్ర కోసం ఎలాంటి అలవాట్లు చేసుకోవాలనేది ఈ రోజున ప్రచారం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 70 దేశాలు ఈ వరల్డ్ స్లీప్ డేను జరుపుకొంటాయి. ఈ ఏడాది ‘‘క్వాలిటీ స్లీప్, సౌండ్ మైండ్, హ్యాపీ వరల్డ్’’ అన్న స్లోగన్ తో స్లీప్ డేను నిర్వహిస్తున్నారు. మంచి నిద్ర ఉంటేనే మనిషి సంతోషంగా లైఫ్ ను లీడ్ చేయగలుగుతాడని డాక్టర్లు చెబుతున్నారు. నిద్ర లేమి, గురక లాంటి సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలని, దీర్ఘ కాలం నిద్ర సమస్యలు కొనసాగితే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

మంచి నిద్ర కోసం కొన్ని టిప్స్..

  • మంచిగా నిద్ర పట్టడం కోసం రోజూ ఒకే సమయంలో నిద్ర పోవడం, ఒకే సమయంలో నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి.
  • ప్రతి రోజూ కనీసం 6 నుంచి 8 గంటల వరకు నిద్ర పోవాలి.
  • మధ్యలో నిద్ర డిస్ట్రబ్ కాకుండా ఉంటే నిద్ర లేచాక ప్రశాంతంగా ఉంటుంది.
  • పని ఒత్తిడి లాంటివి బెడ్రూమ్ వరకూ రాకుండా చూసుకోవాలి. పడుకున్నాక ఫోన్ పక్కన పెట్టేసి ప్రశాంతంగా నిద్ర పోవడానికి ట్రై చేయాలి. 
  • పడుకునేముందు ఒక సారి లైట్ ఆఫ్‌‌ చేస్తే మళ్లీ నిద్రలేచాకే ఆన్‌‌ చేయాలి. రాత్రి కొంచెం తొందరగా నిద్రపోయేలా చూసుకుంటే, ఉదయం తొందరగా నిద్రలేవొచ్చు. దీంతో వర్క్‌‌లో లేజీనెస్‌‌ ఉండదు.
  • నిద్రలేమికి స్ట్రెస్‌‌, యాంగ్జైటీ, తిండి అలవాట్లు కూడా కారణం కావచ్చు. వాటిని పోగొట్టడానికి ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ బాగా ఉపయోగపడుతుంది. రోజుకి 40 నిమిషాల ఎక్సర్‌‌‌‌సైజ్‌‌ వల్ల వీటిని దూరం చేయొచ్చు.
  • చాలామంది నైట్‌‌ టైంలో రకరకాల హెవీ ఫుడ్‌‌ తింటుంటారు. అయితే పిండిపదార్థాలు, స్వీట్‌‌ ఐటమ్స్‌‌, ఆల్కహాల్‌‌, కెఫిన్‌‌ లాంటి వాటికి దూరంగా ఉండాలి.  వీటిబదులు కార్బోహైడ్రేట్స్‌‌ ఎక్కువగా ఉండే పాలు తాగాలి.  బ్రౌన్‌‌ రైస్‌‌లో ఎక్కువగా ట్రిప్టోఫాన్‌‌ ఉంటుంది. అది మంచి నిద్రకు హెల్ప్‌‌ చేస్తుంది. 
  • నిద్రపోతున్న టైంలో తిన్న అన్నం అరగడానికి చాలా టైం పడుతుంది.  దాంతో అజీర్తి, గ్యాస్ట్రిక్‌‌ సమస్య వస్తాయి.  అందుకే నిద్రపోవడానికి మూడు నాలుగు గంటల ముందే డిన్నర్‌‌‌‌ ముగించాలి లేదా లైట్‌‌ ఫుడ్‌‌ తినాలి.
  • కొంతమంది ఎంత నిద్రలో ఉన్నా సరే చిన్న అలికిడికి కూడా లేచి కూర్చుంటారు. ఇలా కాకుండా ఉండాలంటే మొబైల్‌‌ ఫోన్‌‌ లాంటివి సైలెంట్‌‌ చేసుకోవాల్సిందే. అలాగే బెడ్రూమ్‌‌లో లైట్‌‌ ఫోకస్‌‌ తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

మరిన్ని వార్తల కోసం..

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

రష్యా దాడుల్లో ఉక్రెయిన్ నటి మృతి

కరోనాపై మరోసారి రాష్ట్రాలకు కేంద్రం అలెర్ట్