
ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ స్టేడియం భారత్‌లో సిద్ధమవుతుంది. ఇప్పటివరకు ఫిలిప్పిన్స్‌లోని ఫిలిప్పిన్ ఏరీనా ఈ ఘనతను దక్కించుకుంది. ఇందులో 55,000 మంది ప్రేక్షకులు కూర్చొని మ్యాచ్‌లను తిలకించవచ్చు. అయితే ఇప్పుడు ఇండియాలోని అహ్మదాబాద్‌లో నిర్మాణంలో ఉన్న స్టేడియం పూర్తయితే.. ప్రపంచంలో అతి పెద్ద స్టేడియం ఇదే అవుతుంది. ఈ స్టేడియానికి మోటెరా క్రికెట్ స్టేడియంగా నామకరణం చేశారు. ఈ స్టేడియంలో ఇండోర్ గేమ్స్ మాత్రమే కాకుండా క్రికెట్ కూడా ఆడోచ్చు. ఒకేసారి ఈ స్టేడియంలో 1,10,000 మంది ప్రేక్షకులు కూర్చొని ఆటలను చూడవచ్చు. ఇంతమంది కూర్చొని మ్యాచ్‌ని చూసే విధంగా తీర్చిదిద్దిన ఈ స్టేడియం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ స్టేడియం భారత్‌లో నిర్మించబడటం గొప్ప విషయం.
For More News..