అలా చేయకపోతే గల్వాన్, డోక్లాంలో భారత్ ఓడిపోయేది

అలా చేయకపోతే గల్వాన్, డోక్లాంలో భారత్ ఓడిపోయేది

న్యూఢిల్లీ: సైన్యంలో పెట్టుబడులు పెట్టడం భారత్ కు లాభించిందని ఆర్మీ వైస్ చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ సీపీ మొహంతి అన్నారు. ఆర్మీని బలోపేతం చేయడం వల్లే గల్వాన్, డోక్లాంలో చైనాతో జరిగిన ఘర్షణల్లో మనం గెలిచామని.. లేదంటే ఓడిపోయే వాళ్లమన్నారు. సైన్యంలో కేంద్రం పెట్టుబడులు పెట్టకపోతే జమ్మూ, కశ్మీర్ లో నెలకొన్న గందరగోళ పరిస్థితుల్లో మార్పు తీసుకురావడం సాధ్యమయ్యేది కాదన్నారు. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో నక్సల్ ప్రభావాన్ని తగ్గించడం కూడా కష్టమయ్యేదని వ్యాఖ్యానించారు. ఒక దేశ అంతర్గత, బాహ్య భద్రత అనేది.. ఆ దేశ ఆర్మీ ఎంత బలంగా, శక్తిమంతంగా పని చేస్తోందనే విషయం మీద ఆధారపడి ఉంటుందని మొహంతి స్పష్టం చేశారు.

For More News..

చెన్నైని ఓడించడానికి అదొక్కటే మార్గం

మ్యాన్ హోల్లో పడి గల్లంతైన సాఫ్ట్ వేర్ డెడ్ బాడీ లభ్యం