కిలాడి లేడి.. వీడియోతో యువకుడికి బెదిరింపు

V6 Velugu Posted on Apr 11, 2021

ఆన్ లైన్ మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.  ముఖ్యంగా డేటింగ్ యాప్ ల పేరిట యువతులు అందాలతో ఎర వేస్తూ..మాయ మాటలు చెబుతూ యువకులకు వల వేస్తున్నారు. ఫోన్ లో మాట్లాడి తర్వాత డబ్బులివ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య చాలానే జరుగుతున్నాయి. లేటెస్ట్ గా హైదరాబాద్ జీడిమెట్లలో జరిగింది. డబ్బులివ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేసిన ఓ కిలాడి లేడిపై జీడిమెట్ల బాధితుడు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే.. డేటింగ్ యాప్ లో పరిచయం అయిన యువతి ఆ యువకుడితో వీడియో కాల్ లో మాట్లాడింది. ఆ వీడియోని స్క్రీన్ రికార్డు చేసి డబ్బులు డిమాండ్ చేసింది. లేకపోతే సోషల్ మీడియాలో వీడియో అప్ లోడ్ చేస్తానని యువకుడిని బెదిరించింది. దీంతో ఆ బాధితుడు శనివారం రాత్రి పోలీసులను ఆశ్రయించాడు. భాదితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పేట్ బషీరాబాద్ పోలీసులు.

Tagged woman, money, dating app

Latest Videos

Subscribe Now

More News