సిగ్గుపడాల్సిన అవసరమే లేదు.. జగన్, భారతి క్షమాపణ చెప్పాలి: షర్మిల

సిగ్గుపడాల్సిన అవసరమే లేదు.. జగన్, భారతి క్షమాపణ చెప్పాలి: షర్మిల

చిత్తూరు: అమరావతి వేశ్యల రాజధాని అంటూ పాత్రికేయుడు, విశ్లేషకుడు కృష్ణంరాజు ఓ టీవీ ఛానెల్ డిబేట్‎లో చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‎లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో కృష్ణంరాజు వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. సోమవారం (జూన్ 9) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి వేశ్యల రాజధాని అంటూ సాక్షి టీవీలో చేసిన కామెంట్స్‎కు మీద భారతి రెడ్డి, జగన్ బాధ్యత వహించాలన్నారు. భారతి రెడ్డి, జగన్ వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల మనోభావాలు దెబ్బతీసినందుకు వాళ్లు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదన్నారు. ఆంధ్రుల రాజధాని అమరావతి. మన రాజధాని మీద ఇలాంటి కామెంట్స్ ఎవరు చేసినా క్షమించారని నేరం. అమరావతి వేశ్యల రాజధాని అనడం బేస్ లెస్ అండ్ సెన్స్ లెస్ అంటూ ఫైర్ అయ్యారు. 

‘‘అమరావతి మన రాజధాని.- అమరావతి రాజధానిగా ఉండటం మనకు గర్వ కారణం. గత 10 ఏళ్లుగా ఇప్పటి వరకు రాజధాని లేదు.- ఇప్పుడు అమరావతి మన రాజధాని అని నిర్మించుకునే సమయం. ఇలాంటి సమయంలో రాజధాని గురించి వ్యతిరేకంగా మాట్లాడిన ఏ అంశం కూడా క్షమించరానిది. వేశ్యల రాజధాని అనే వాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇలాంటి మాటలు క్షమించరానివి. ఇలా మాట్లాడటం దురదృష్టకరం. ఇది చిన్న విషయం కాదు. ఇలాంటి పొరపాటు జరిగినందుకు ఎవరైనా క్షమాపణ చెప్పాలి. పార్టీ అయినా.. మీడియా హౌజ్ అయినా క్షమాపణలు చెప్పాలి. 

ALSO READ | సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు

వైసీపీకి చెందిన సాక్షి చానెల్‎లో ప్రసారం చేసినందుకు సాక్షి హౌజ్ క్షమాపణ చెప్పాలి. అలాగే- సాక్షి మీడియా హౌజ్ నడుపున్న భారతి రెడ్డి క్షమాపణ చెప్పాలి. భారతి రెడ్డి క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు. నామోషీ చెందాల్సిన అవసరం అంతకన్నా లేదు. వైసీపీ అధినేత- జగన్ కూడా క్షమాపణ చెప్పాలి. మహిళల మనోభావాలు దెబ్బతీశారు. మహిళల మనోభావాలు దెబ్బతీసి‎నందుకు క్షమాపణ చెప్పడంలో ఎందుకు జగన్ వెనకడుగు వేస్తున్నారు. ఇలాంటి నీచపు కామెంట్స్ రాజధాని అమరావతి మీద ఎలాంటి ఎఫెక్ట్ పడవు. అక్కడ వేశ్యలు కాదు.. అందరు ఉంటారు.. అన్ని వర్గాల వారు ఉంటారు. ఇవి బేస్ లెస్ అండ్ సెన్స్ లెస్ కామెంట్స్’’ అని షర్మిల అన్నారు.