
ఢిల్లీ : ఢిల్లీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ధర్నా మరికాసేపట్లో ప్రారంభంకానుంది. తెలంగాణ రాష్ట్రంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరపాలంటూ ధర్నా తలపెట్టారు. ధర్నా అనంతరం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన అవినీతి గురించి దేశవ్యాప్తంగా తెలియడం కోసం తాము నిరసన కార్యక్రమం చేపట్టామని వైస్సార్ తెలంగాణ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్నారు.
ప్రాజెక్టును కమీషన్ల కోసమే..
కాళేశ్వరం ప్రాజెక్టును కమీషన్ల కోసమే కట్టారని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇది అవసరం లేని ప్రాజెక్టన్నారు. రీ డిజైనింగ్ పేరుతో ప్రాజెక్టు ఖర్చును మూడింతలు పెంచారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల కోసమే పోరాటం చేస్తున్నానని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. మార్చి 14న తలపెట్టిన ర్యాలీకి తెలంగాణ ఎంపీలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు