మార్బుల్ క్వారీ కూలి 17 మంది మృతి

మార్బుల్ క్వారీ కూలి 17 మంది మృతి

మార్బుల్ క్వారీ కూలి 17 మంది మృతి చెందిన విషాద ఘటన పాకిస్తాన్‌లో జరిగింది. మొహమండ్ జిల్లాలోని జియారత్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం పాలరాయి క్వారీ కూలింది. భారీ పేలుడు పదార్థాలు ఉపయోగించడం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోగా.. మరో 11 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.

పాకిస్తాన్ సైనికలు మరియు రెస్య్కూ టీం శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందకు మంగళవారం ఉదయం తవ్వకాలు ప్రారంభించారు. క్వారీ కుప్పకూలిన సమయంలో క్వారీలో 40 నుంచి 50 మంది పనిచేస్తున్నారని మొహమండ్ జిల్లా పోలీసు చీఫ్ తారిక్ హబీబ్ తెలిపారు. ‘ఈ క్వారీలలో సాధారణంగా చాలా ఎక్కువ మంది పనిచేస్తారు. అయితే సాయంత్రం కావడంతో అప్పటికే చాలామంది ఇళ్ళకు వెళ్లిపోయారు. అందుకే ప్రాణనష్టం తక్కువగా జరిగింది. లేకపోతే చాలామంది ప్రాణాలు కోల్పోయేవారు’ అని ఆయన అన్నారు. కాగా.. మరణించిన వారిని వారి కుటుంబసభ్యులు వెంటనే ఇళ్లకు తీసుకెళ్లడం వల్ల మరణాల సంఖ్య ఖచ్చితంగా చెప్పలేకపోతున్నామని జిల్లా ఆస్పత్రి సూపరింటేండెంట్ సమీన్ షిన్వారీ తెలిపారు.

పాకిస్తాన్‌లో ఇటువంటి మైనింగ్ ప్రమాదాలు జరగడం సర్వసాధారణం. ఫిబ్రవరిలో బునెర్‌లోని పాలరాతి క్వారీలో ప్రమాదం జరిగి 10 మంది మరణించారు. క్వెట్టాలో 2018లో రెండు బొగ్గు గనులలో జరిగిన పేలుళ్లలో ముప్పై మంది కార్మికులు మరణించారు. అదేవిధంగా 2011లో కూడా క్వెట్టాలో బొగ్గు గని లోపల పేలుడు సంభవించి 45 మంది కార్మికులు మరణించారు.

For More News..

వీడియో: పోలీసుల కళ్ల ముందే నిందితుడిని కొట్టి చంపిన జనాలు

పేషంట్ చనిపోయిన తర్వాత కూడా వైద్యం పేరుతో దోపిడీ

కరోనా రిపోర్ట్ కోసం మనసు చంపుకొని డాక్టర్‌తో..

రాష్ట్రంలో మరో 2,932 కరోనా పాజిటివ్ కేసులు

ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి మృతి