మద్యం మత్తులో కారు ర్యాష్ డ్రైవింగ్,ముగ్గురికి గాయాలు

మద్యం మత్తులో కారు ర్యాష్ డ్రైవింగ్,ముగ్గురికి గాయాలు

జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో హర్షవర్థన్ అనే వ్యక్తి ర్యాష్ డ్రైవింగ్ చేశాడు.దీంతో చెక్ పోస్ట్ దగ్గర ఓ ఆటోతో పాటు... రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి.గాయపడిన వారిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవింగ్ చేసిన హర్షవర్థన్ ను అదుపులోకి తీసుకొని బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయగా... 233 పాయింట్లు వచ్చినట్లు తెలిపారు పోలీసులు.

మరిన్ని వార్తల కోసం

గేదెను తప్పించబోయి ఆర్టీసీ బస్సు తుక్కుతుక్కు

13 ఏండ్లకే సొంత బ్రాండ్..లక్షల్లో సంపాదన