ఈ నెల 30న ఢిల్లీలో సీఎంలు, సీజేఐల సదస్సు

ఈ నెల 30న ఢిల్లీలో సీఎంలు, సీజేఐల సదస్సు

న్యూఢిల్లీ: ఈ నెల 30న ఢిల్లీలో అన్ని రాష్ట్రాల సీఎంలు, హైకోర్టు సీజేల కాన్ఫరెన్స్ జరగనుంది. సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశానికి పీఎం మోడీ కూడా హాజరు కానున్నారు. నేషనల్ జ్యూడిషీయల్ ఇన్ఫ్రాస్టక్టర్ అథారిటీ ఏర్పాటు ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు నిర్వహించనున్నారు. దేశంలోని కోర్టుల్లో మౌలిక సదుపాయాల మెరుగు కోసం అథారిటీని ఏర్పాటు చేయాలని సీజేఐ ఎన్వీ రమణ గత కొన్ని రోజులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. సరైన మౌళిక సదుపాయాలు లేక కోర్టుల్లో పనితీరు మందకొడిగా సాగుతోందని, ఈ సమస్యలన్నింటికీ అథారిటీ ఏర్పాటు పరిష్కారం కాగలదని సీజేఐ చెబుతున్నారు. అథారిటీ ఏర్పాటుతో కేసులు త్వరితగతిన పరిష్కారం జరిగి ప్రజలకు సత్వర న్యాయం అందే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా కోర్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా వీలైనంత త్వరగా నింపాలని న్యాయమూర్తులు కోరుతున్నారు. అలాగే కరోనా నేపథ్యంలో కోర్టుల్లో వేల కొద్దీ కేసులు పేరుకుపోయాయని, వాటిపై కూడా ఈ సదస్సులో చర్చించనున్నారు. 

మరిన్ని వార్తల కోసం...

తమిళనాడును విభజించే కుట్ర

నిరుద్యోగుల ఉపాధి కోసం కొత్త జోనల్ వ్యవస్థ