టెస్టులు సక్సెస్ : ‘యాసిడ్’ బాధితులకు కొత్త ముఖాలు!

టెస్టులు సక్సెస్ : ‘యాసిడ్’ బాధితులకు కొత్త ముఖాలు!

పాకిస్థాన్.. టెర్రరిస్టులకు, టెర్రర్ సంస్థలకు మాత్రమే కాదు.. యాసిడ్ దాడులకు కూడా ‘ఫేమస్’. ఏటా కనీసం 400 మందిపై అక్కడ యాసిడ్ దాడులు జరుగుతున్నాయి. ఆడాళ్లు, చిన్న పిల్లలపైనే ఎక్కువగా అటాక్స్ జరుగుతున్నాయి.ప్రతి ఏడాది బాధితులుగా మారుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ట్రీట్ మెంటుకు అయ్యే ఖర్చు లక్షల్లో ఉంటోంది. దీంతో యాసిడ్ వల్ల చర్మం కాలిపోయిన వారు ట్రీట్ మెంటు చేయించుకోలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం చాలా తక్కువ ఖర్చుతో ‘ఆర్టిఫిషియల్ స్కిన్’ రూపొందించారు డాక్టర్ రావూఫ్ అహ్మద్.

టెస్టులు సక్సెస్

అహ్మద్ తయారు చేసిన ఆర్టిఫిషియల్ స్కిన్​ను తొలుత జంతువులపై టెస్టు చేశారు. దాదాపు ఆరు నెలల పాటు వాటిపై కన్నేసి ఉంచారు. తర్వాత 2018 అక్టోబర్​లో తొలిసారిగా ఓ మనిషిపై ట్రయల్స్ నిర్వహించారు. ప్రస్తుతం జిన్నా ఆస్పత్రిలోని బర్న్స్ యూనిట్​లో ఐదుగురు మగాళ్లు, ఎనిమిది మంది ఆడాళ్లకు ఆర్టిఫిషియల్ స్కిన్ వేశారు. వాళ్లు ప్రస్తుతం డాక్టర్ పర్యవేక్షణలోనే ఉన్నారు. వీరిలో ఆరుగురు పేషెంట్లు యాసిడ్ దాడి బాధితులు. కొత్త స్కిన్ వేసిన పేషెంట్లకు బ్యాక్టీరియా, కాలుష్యం దరి చేరకుండా జాగ్రత్తపడుతున్నామని, ఫలితాలు బాగున్నాయని, భవిష్యత్ లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఆశిస్తున్నట్లు అహ్మద్ చెప్పారు.

తొలి పేషెంట్

ఆర్టిఫిషియల్ స్కిన్ అతికించిన తొలి పేషెంట్​ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. తల పై భాగంలో అతనికి కొత్త స్కిన్ ను అంటించారు. ‘‘అతడికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకలేదు. మచ్చలు కూడా కనిపించడం లేదు. అలాగే మిగతా పేషెంట్లు కూడా కృత్రిమ చర్మం ఇంప్లాంట్ చేసిన 8, 10 రోజుల్లో రికవర్ అయ్యారు. ఇది నాకు చాలా ఆనందాన్నిచ్చింది. వెంటనే క్లినికల్ అప్రూవల్ కు దరఖాస్తు పెట్టాను. కొద్ది రోజుల్లోనే నేను రూపొందించిన స్కిన్​ను క్లినికల్ అవసరాలకు వాడుకునేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇకపై అందరికీ మంచి జరుగుతుంది” అని డాక్టర్ అహ్మద్ చెప్పారు.

బాధితులకు బాసటగా ‘స్మైల్ అగైన్’

లాహోర్​లోని డెపిలెక్స్ స్మైల్ అగైన్ ఫౌండేషన్.. ఏటా వందలాది యాసిడ్ దాడి బాధితులను ఆదుకుంటోంది. యాసిడ్ వల్ల కాలిపోయిన ముఖాన్ని బాగు చేసేందుకు భారీగా ఖర్చు పెడుతోంది. ‘‘డ్యామేజ్​ను రిపేర్ చేసేందుకు 30 నుంచి 40 సర్జరీలు, స్కిన్ గ్రాఫ్ట్​లు అవసరం పడతాయి. ఈ ప్రొసిజర్ మొత్తానికి దాదాపు41 వేల రూపాయలు ఖర్చవుతాయి. తక్కువ ఖర్చుతో కూడిన ఆర్టిఫిషియల్ స్కిన్ అభివృద్ధి చేయడం చాలా మంచి పరిణామం.” అని స్మైల్ అటైన్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ మేనేజర్ అబ్దియా షహీన్ ఖాద్రీ చెప్పారు.