ED ఎదుట చందాకొచ్చర్‌ హాజరు

ED ఎదుట చందాకొచ్చర్‌ హాజరు

మనీలాండరింగ్‌ క్రిమినల్‌ కేసును ఎదుర్కొంటున్నICICI బ్యాంకు మాజీ CEO చందా కొచ్చర్‌ ఇవాళ (సోమవారం) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED) ఎదుట హాజరయ్యారు. ఢిల్లీలోని ED కార్యాలయానికి చేరుకున్న ఆమెను అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు నిమిత్తం చందాకొచ్చర్‌ , ఆమె భర్త దీపక్‌ కోచ్చర్‌, ఆయన సోదరుడు రాజీవ్‌లకు గత నెల ED సమన్లు జారీ చేసింది. ఇప్పటికే దీపక్‌, రాజీవ్‌లు విచారణకు హాజరయ్యారు.

2012లో వీడియోకాన్‌ గ్రూప్‌ రూ. 3250 కోట్ల రుణాలు పొందిందని, దీనివల్ల కొచ్చర్‌ కుటుంబం లాభపడిందని ఆరోపణలు రావడంతో విషయం వివాదాస్పదమైంది. దీంతో వారిపై మనీ లాండరింగ్‌ క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీడియోకాన్‌ గ్రూప్‌ రుణాల అవకతవకల వివాదం కారణంగా చందా కొచ్చర్‌ గతేడాది అక్టోబరులో ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ పదవి నుంచి తప్పుకున్నారు.