మేయర్‌గా ఓవైసీ అభ్యర్థిని కూర్చొబెట్టాలని సీఎం కేసీఆర్ చూస్తున్నడు

మేయర్‌గా ఓవైసీ అభ్యర్థిని కూర్చొబెట్టాలని సీఎం కేసీఆర్ చూస్తున్నడు

అక్రమ అరెస్టులను నిరసిస్తూ బీజేపీ మంగళవారం చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. దాంతో బీజేపీ నేతలు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. బీజేపీ చలో అసెంబ్లీ ముట్టడి పిలుపుతో పోలీసులు అసెంబ్లీ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. దాంతో బీజేపీ నేతల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. నేతలు అసెంబ్లీ వద్దకు చేరుకోకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయినా కూడా నేతలు, కార్యకర్తలు విడతలవారిగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. దాంతో వచ్చిన వారిని వచ్చినట్లు పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ మేయర్‌గా ఓవైసీ అభ్యర్థిని కూర్చొబెట్టాలని సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే కార్పొరేటర్ అభ్యర్థుల ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. కార్పొరేషన్లలో జనగణన సరిగా చేయలేదని అంటున్నారు. ఓల్డ్ సిటీ కార్పొరేషన్ పరిధిలో 20 వేల మంది ఓటర్లు ఉంటే, మిగతా ప్రాంతాలలో 60 వేల మంది ఓటర్లని ఉంచుతున్నారని.. అది ఎలా కరెక్ట్ అని వారు ప్రశ్నిస్తున్నారు.

For More News..

17 ఏళ్ల యువతిపై తండ్రి, బాయ్‌ఫ్రెండ్ అత్యాచారం

పారిపోయి పెళ్లిచేసుకోవాలనుకున్న అన్నాచెల్లెళ్లు.. పట్టుకొచ్చి చంపేసిన కుటుంబసభ్యులు

రాష్ట్రంలో మరో 1,708 కరోనా కేసులు