ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా చూడాలి : తేజస్ పవార్

ఓటర్  జాబితాలో తప్పులు లేకుండా చూడాలి : తేజస్  పవార్

వనపర్తి, వెలుగు: ఓటరు జాబితాలో తప్పులు లేకుండా తయారు చేయాలని కలెక్టర్  తేజస్  పవార్  సూచించారు. బుధవారం కలెక్టరేట్​లో జిల్లా, నియోజకవర్గ ట్రైనర్లతో రివ్యూ నిర్వహించి పవర్  పాయింట్  ప్రజెంటేషన్  ద్వారా పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఫారం 6, 7,8 పై బీఎల్​వోలకు అవగాహన కల్పించాలన్నారు. 

ఎలక్షన్  సెక్షన్  సూపరింటెండెంట్  రమేశ్​రెడ్డి, ట్రైనర్లు పాల్గొన్నారు.
గద్వాల: తప్పులు లేకుండా ఓటర్  జాబితాను రెడీ చేయాలని గద్వాల కలెక్టర్  పుల్లూరు క్రాంతి ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్  మీటింగ్ హాల్ లో ఫొటో ఎలక్ట్రోల్  స్పెషల్  సమ్మరీ రివిజన్–2023పై నియోజకవర్గ స్థాయి మాస్టర్  ట్రైనర్ల శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బీఎల్​వోలు గరుడ యాప్  ఉపయోగించేలా చూడాలన్నారు. ఈ నెల 27 వరకు పెండింగ్ లో ఉన్న ఫామ్స్  కంప్లీట్ చేయాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లను తనిఖీ చేసి సౌలతులు ఉండేలా చూసుకోవాలన్నారు. అడిషనల్  కలెక్టర్  అపూర్వ్ చౌహాన్  పాల్గొన్నారు.