చిత్తూరు ప్రమాద ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య

చిత్తూరు ప్రమాద ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య

చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. శనివారం రాత్రి భాకరాపేట కనుమలో మలుపు వద్ద బస్సు బోల్తా పడిన ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే చనిపోయారు. బస్సులో ఉన్న మొత్తం ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంగప్ప భార్య ఎం నాగలక్ష్మి (60) ఆదివారం సాయంత్రం రుయా ఆసుపత్రిలో చికిత్సా పొందుతూ కోలుకోలేక తుదిశ్వాస విడిచింది. దీంతో మృతుల సంఖ్య 9కి చేరింది.
అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని రాజేంద్రనగర్ కు చెందిన వేణుకు చిత్తూరు జిల్లా నారాయణవరానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయించారు. తిరుచానూరులో ఇవాళ ఆదివారం నిశ్చితార్ధానికి అంతరూ ధర్మవరం నుంచి బస్సులో బయలుదేరి వస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది.  నిన్న రాత్రి స్పాట్ లో చనిపోయిన 8మందికి ఇవాళ  మధ్యాహ్నం అనంతపురం జిల్లా ధర్మవరంలో అంత్యక్రియలు నిర్వహించారు. 

 

ఇవి కూడా చదవండి

ఇస్లామాబాద్లో ఇమ్రాన్ ఖాన్ బలప్రదర్శన

వీడియో: బిహార్ సీఎం నితీష్పై యువకుడి దాడి

ప్రపంచంలోనే పెద్ద అవినీతిపరుడి చేతిలో తెలంగాణ నలిగిపోతోంది

కడప నుంచి విజయవాడకు ఇండిగో విమాన సర్వీసులు