భార్యను చూసి రావొచ్చు.. సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు అనుమతి

భార్యను చూసి రావొచ్చు.. సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు అనుమతి

న్యూఢిల్లీ: అనారోగ్యంతో ఉన్న భార్యను చూసివచ్చేందుకు ఢిల్లీ మాజీ మంత్రి మనీ శ్ సిసోడియాకు హైకోర్టు అనుమతిచ్చిం ది. శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సిసోడియాను ఇంటికి తీసుకెళ్లి అతని భార్యను పరామ ర్శించేందుకు అవకాశం కల్పించాలని తీహార్ జైలు సూపరింటెండెంట్​ను జడ్జి శుక్రవారం ఆదేశించారు.

సిసోడియా ను కుటుంబ సభ్యులతో తప్ప.. ఇతర వ్యక్తులతో  మాట్లాడనివ్వొద్దని, ఫోన్, నెట్ అందుబాటులో ఉంచొద్దని హైకోర్టు స్పష్టంచేసింది. మనీ లాండరిం గ్ కేసులో మద్యంతర బెయిల్ కోసం సిసోడియా వేసిన పిటిషన్​పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. నరాల వ్యాధితో బాధపడుతున్న తన భార్య ఆరోగ్యం క్షీణించడంతో ఆయన బెయిల్ కోరుతు న్నారు. మార్చి 9న అరెస్టైన సిసోడియా ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.