liqour scam : జూన్ 2 వరకు మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు

liqour scam : జూన్ 2 వరకు మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు

ఢిల్లీ : లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం  మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరోసారి పొడిగించింది. జూన్ 2 వరకు కస్టడీ పొడిగిస్తూ రౌస్  అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మనీశ్  జ్యుడీషియల్ కస్టడీ  మే 12వ తేదీతో ముగియడంతో  ఆయనను సీబీఐ  కోర్టులో హాజరుపర్చింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మనీష్ సిసోడియా తీహార్ జైలులో ఉంటున్నారు. 

ఢిల్లీ లిక్కర్  స్కాంలో   మనీష్ సిసోడియా  రిమాండ్  రిపోర్టులో  ఢిల్లీ సీఎం అరవింద్  కేజ్రీవాల్  పేరును చేర్చింది ఈడీ.  సీబీఐ నోటీసులివ్వడంతో కేజ్రీవాల్ ఏప్రిల్ 16న సీబీఐ విచారణకు హాజరయ్యారు. దాదాపు 9 గంటల పాటు కేజ్రీవాల్ ను సీబీఐ విచారించింది. ఎన్ని సార్లు పిలిచినా సీబీఐ విచారణకు హాజరవుతానని కేజ్రీవాల్ చెప్పారు. ఈడీ విచారణ మొత్తం వంద కోట్ల ముడుపుల గురించే విచారణ జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా ఈడీ విచారించింది.

ఇటీవల మూడో  చార్జ్ షీట్  దాఖలు చేసిన ఈడీ చార్జ్ షీట్ లో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ పేరును చేర్చిన సంగతి తెలిసిందే.  లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితనే ముడుపులు ఇచ్చారని ఆరోపించింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కవిత తమ బినామీల ద్వారా వ్యాపారం చేశారని తెలిపింది. లిక్కర్ లాభాలతో  అరుణ్ పిళ్లై ద్వారా కవిత భూములు కొనుగోలు చేశారని చెప్పింది. తనకున్న పలుకుబడితో హైదరాబాద్ లో తక్కువ ధరకే కవిత భూములు కొన్నారని తెలిపింది. భూముల కొనుగోలు లావాదేవీలన్నీ అరుణ్ పిళ్లై బ్యాంక్ ఖాతా ద్వారానే జరిగినట్లు చెప్పింది.