సెకండ్ వేవ్ తో పోలిస్తే కోవిడ్ తీవ్రత తక్కువ

సెకండ్ వేవ్ తో పోలిస్తే కోవిడ్ తీవ్రత తక్కువ

ఢిల్లీలో కోవిడ్ పరిస్థితులను వివరించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయన్నారు. కానీ ఆసుపత్రిలో చేరే కేసులు తగ్గుతున్నాయిని తెలిపారు.  కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు సీఎం. ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. ప్రస్తుతం చాలా కోవిడ్ కేసులు తేలికపాటి, లక్షణరహితంగా ఉన్నాయిని తెలిపారు కేజ్రీవాల్. చాలా తక్కువమంది ప్రజలు మాత్రమే కరోనాతో ఆసుపత్రుల్లో చేరుతున్నారన్నారు. మెజారిటీ కోవిడ్ రోగులు ఆసుపత్రుల్లో చేరకుండా కొలుకుంటున్నారని కేజ్రీ పేర్కొన్నారు. చాలా మంది రోగులలో ఆక్సిజన్ అవసరం లేదు. కరోనా బాధితుల కోసం ఢిల్లీ వ్యాప్తంగా 246 హాస్పిటల్లో బెడ్స్ ఉన్నాయన్నారు. ఢిల్లీలో ఆక్సిజన్ బెడ్స్ 37 వేలకు పైగా ఉన్నాయిని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతానికి 87 ఆక్సిజన్ బెడ్స్ లో మాత్రమే కరోనా పేషెంట్లు ఉన్నారన్నారు. సెకండ్ వేవ్ తో పోలిస్తే ప్రస్తుతం కోవిడ్ తీవ్రత తక్కువగా ఉందన్నారు కేజ్రీవాల్. ప్రజలు అప్రమత్తంగా ఉండి సామాజిక దూరం పాటించాలన్నారు. ప్రతీ ఒకరు విధిగా మాస్కు ధరించాలని స్పష్టం చేశారు.  ప్రస్తుతం ఢిల్లీలో ప్రస్తుతం 6360 కరోనా యక్టీవ్ కేసులున్నాయి. ఈరోజు కొత్తగా 3100 పైగా కోవిడ్ కేసులు రావచ్చని సీఎం తెలిపారు. 

ఇవి కూడా చదవండి:

ఒమిక్రాన్ ఎఫెక్ట్: మరో రాష్ట్రంలో థియేటర్ల మూసివేత

హిజాబ్ ధరిస్తే క్లాస్ రూంలోకి నో ఎంట్రీ