సంజయ్ రౌత్‌కు ఈడీ సమన్లు 

సంజయ్ రౌత్‌కు ఈడీ సమన్లు 

మహారాష్ట్ర రాజకీయలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. ఒకవైపు సంక్షోభం కొనసాగుతుండగానే మరోవైపు కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. ప్రవీణ రౌత్‌, ప‌త్రా చావ‌ల్ ల్యాండ్ స్కామ్ కేసులో మంగళవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి గతంలోనే సంజ‌య్ రౌత్‌కు చెందిన కొన్ని ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. తాజాగా విచారణ వేగవంతం చేసిన ఈడీ సంజయ్ రౌత్ కు సమన్లు జారీ చేసింది.

ఇదిలా ఉంటే రౌత్‌కు స‌మన్లు జారీ చేయ‌డంపై శివసేన పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ కుట్రలో భాగంగానే సంజయ్ కు ఈడీ నోటీసులు జారీ చేసిందని ఆరోపిస్తున్నారు.  రూ.1,034 కోట్ల విలువైన పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.11.15 కోట్లు విలువైన ఆస్తులను ఈడీ ఏప్రిల్ నెలలో జప్తు చేసింది.