
రుణ యాప్‌ల కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు స్పీడప్ చేసింది. ఫైనాన్స్ కంపెనీ పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన మరో రూ.131 కోట్లు జప్తు చేసినట్టు ఈడీ తెలిపింది. క్యాష్ బీన్ మొబైల్ యాప్ ద్వారా PCFS రుణాలిచ్చిందని చెప్పింది. చైనాకు చెందిన జో యాహుయ్ ఆధీనంలో పనిచేస్తున్న PCFS.. బోగస్ సాఫ్ట్ వేర్ ఎగుమతుల పేరుతో చైనా, హాంకాంగ్, తైవాన్, యూఎస్, సింగపూర్‌కు నిధులు మళ్లించినట్టు ED చెప్పింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించినందుకు PCFS సొమ్ము జప్తు చేశామంది. గతంలో PCFS కు చెందిన రూ.106 కోట్లను ఈడీ జప్తు చేసింది.