ED ఎదుట హాజరైన రియా చక్రవర్తి

ED ఎదుట హాజరైన రియా చక్రవర్తి

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి  డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ED) ఎదుట హాజరైంది. అయితే సుప్రీం కోర్టులో తన పిటిషన్ విచారణకు వచ్చేంత వరకు తన స్టేట్ మెంట్ ను రికార్డు చేయవద్దని ED ని రియా కోరింది. అయితే, ఆమె విన్నపాన్ని ఈడీ అధికారులు తిరస్కరించారు. అంతేకాదు..ఇవాళ(శుక్రవారం) విచారణకు హాజరు కావాలని మరోసారి సమన్లు జారీ చేయడంతో విధిలేని పరిస్థితుల్లో ముంబైలోని ED కార్యాలయానికి ఆమె హాజరైంది.

బీహార్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి  రియా చక్రవర్తి కన్పించకుండా పోయింది. ఆమెపై ED కూడా కేసు నమోదు చేసింది. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల నుంచి కోట్లాది రూపాయలు ట్రాన్స్ ఫర్ కావడంపై ED విచారించనుంది. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని రియాను ఆదేశించింది.