బీజేపీని ఆంజనేయ స్వామి కూడా ఆదుకోలేకపోయాడు

బీజేపీని ఆంజనేయ స్వామి కూడా ఆదుకోలేకపోయాడు

కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ చరిత్ర లిఖించనున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నేత కొన్ని రోజుల క్రితం చేసిన భారత్ జోడో యాత్ర పార్టీకి కలిసి వచ్చిందనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఇక ముందు నుంచీ బజరంగ్ దళ్ వ్యవహారాన్ని అనుకూలంగా మార్చుకుని, బీజేపీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే భజరంగ్ దళ్ ను నిషేదిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీన్ని ప్రచారాస్త్రంగా మార్చుకున్న  బీజేపీ.. అదే నినాదంతో ముందుకెళ్లింది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ సైతం ప్రస్తావించారు. మే 3న కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన మూడు బహిరంగ సభల్లోనూ.. ప్రధాని మోడీ 'జై బజరంగ్ బలి' నినాదాలు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైట్‌వింగ్ సంస్థ బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఈ వివాదంపై భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ సైతం ఆందోళనలు చేశాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులు ముట్టడించి, నిరసనలు తెలిపాయి. కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్.. కన్నడ జనం మాత్రం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. భజరంగ దళ్ గట్టెక్కిస్తుందని భావించినా.. ఓటర్లు మాత్రం ఆ దిశగా ఆలోచించలేదు. దీంతో ఆంజనేయస్వామి కూడా బీజేపీని కాపాడలేకపోయాడంటూ కాంగ్రెస్ సంతోషంతో సంబరాలు మొదలుపెట్టింది. ఈ సందర్భంలోనే కాంగ్రెస్ విజయానికి గుర్తుగా కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ వద్ద జై బజరంగ్ బలి అంటూ నినాదాలు చేస్తూ విక్టరీని ఎంజాయ్ చేస్తున్నారు.