గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఒకేసారి రూ. 50 పెంపు

గ్యాస్ వినియోగదారులకు షాక్.. ఒకేసారి రూ. 50 పెంపు

దేశంలో గత 12 రోజుల నుంచి చమురు ధరలు రోజూ పెరుగుతున్నాయి. అవి చాలదన్నట్లు తాజాగా గ్యాస్ ధరలను కూడా పెంచుతూ చమురు కంపెనీలు షాక్ ఇచ్చాయి. ఒక్కో గ్యాస్ సిలిండర్‌పై రూ. 50 పెంచుతూ వినియోగదారుల మీద భారం పెంచాయి. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశాయి. ప్రస్తుతం దేశరాజధాని ఢిల్లీలో రాయితీ సిలిండర్ ధర రూ. 594గా ఉండగా.. పెంచిన ధర వల్ల రూ. 644కు చేరుకుంది. అదేవిధంగా హైదరాబాద్‌లో రూ. 646.50 ఉండగా.. తాజాగా పెంచిన ధర వల్ల రూ. 696.50కు చేరింది. ముంబైలో సిలిండర్ ధర రూ .594, చెన్నైలో రూ. 610, కోల్‌కతాలో రూ. 620గా ఉంది. ఏదేమైనా పెంచిన పెట్రోల్, వంటగ్యాస్ ధరల వల్ల సామాన్యులు మాత్రమే ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

For More News..

జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రధాని ఆరా.. బండి సంజయ్‌కు ఫోన్

ప్రపంచంలో సింగపూర్‌లోనే తొలిసారిగా ల్యాబ్ చికెన్

పెళ్లి వాహనంపై బోల్తా పడ్డ ఇసుక లారీ.. ఎనిమిది మంది మృతి