
- మనీ ల్యాండరింగ్ కేసు అంటూ వీడియో కాల్
- సీబీఐ, ట్రాయ్ అధికారులుగా పరిచయం
హైదరాబాద్ : డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ లేడీ టీచర్ను బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ.7 లక్షలు కాజేశారు. తాను మోస పోయినట్లు తర్వాత తె లుసుకున్న బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసుల కు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లోని అమీర్ పేటలో నివాసం ఉంటే ఓ మహిళా టీచర్కు సె ప్టెంబరు 28న గుర్తు తెలియని వ్యక్తులు వీడియో కాల్ చేసి మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తా మని బెదిరించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరుతో లేఖను పంపించారు. ఫోన్ లో మాట్లాడిన మహిళ తాను ట్రాయ్ ఉద్యోగి ప్రియా శర్మ అని పరిచయం చేసుకుంది.
►ALSO READ | ‘పుష్ప’ అమ్మిన సరుకు ఎర్ర చందనం.. నల్గొండ జిల్లాలో దొంగల టార్గెట్ శ్రీగంధం !
లేడీ టీచర్ ఆధార్ కార్డ్ను ఉపయోగించి ముంబైలో అక్రమంగా సిమ్ కార్డు కొనుగోలు చేశారని ఆరోపించింది. ఆ తర్వాత మరో వ్యక్తి కాల్లో అందుబాటులోకి వచ్చి సీబీఐ అధికారి విజయ్ఖన్నాగా చెప్పుకున్నాడు. మనీ ల్యాండరింగ్ కేసులో ప్రమేయం ఉందని చెప్పి రాత్రంతా వీడియో కాల్ ఆన్ లోనే ఉంచాలని ఆదేశించారు. మరుసటి రోజు ఈడీ నుంచి అరెస్ట్ లేఖ పంపిన నేరగాళ్లు, రూ.7 లక్షలు తమ ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నారు. కేసు దర్యాప్తు తర్వాత తిరిగి డబ్బులు ఇస్తామని చెప్పారు.