పండక్కి కొత్త ఫోనా.. అయితే 5G కొనేద్దాం : 70 శాతం ఫీలింగ్ ఇదే

పండక్కి కొత్త ఫోనా.. అయితే 5G కొనేద్దాం : 70 శాతం ఫీలింగ్ ఇదే

పండగ సీజన్లో భారతదేశంలో 5జీ స్మార్ట్ ఫోన్ల అమ్మకాల్లో భారత్ గణనీయంగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు టెక్ నిపుణులు. 70 నుంచి 75 శాతం వరకు వృద్ధి సాధిస్తుందంటున్నారు. 2023 జూలై వరకు 5జీ స్మార్ట్ ఫోన్ల షిప్ మెంట్లలో గతేడాదితో పోలిస్తే  65 శాతం వృద్ధి సాధించింది. ఇది వృద్ది ప్రీమీయం స్మార్ట్ ఫోన్లు రెండింటిలోనూ. (రూ. 25వేల నుంచి అంతకంటే  ఎక్కువ, రూ. 7 వేల నుంచి 25వేల మధ్య ) వరసగా 61, 68 శాతం పెరుగుదల కనిపించింది. 

డేటా ప్రకారం.. ఇండియాలో 5జి స్మార్ట్ ఫోన్ల షిప్మెంట్లో లీడర్ సామ్ సంగ్.. ఇది 25శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. తర్వాత 14 శాతం వీవో, 12 వన్ ప్లస్ మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. గతేడాది కంటే ఈ ఏడాది 34 శాతం అధికంగా దాదాపు 150 5 జీ స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. 

2023 రెండో త్రైమాసికంలో ఇండియాలో స్మార్ట్ ఫోన్ షిప్ మెంట్ 6శాతానికి తగ్గింది. అయితే 5జీ స్మార్ట్ ఫోన్ షిప్ మెంట్ మాత్రం 45 శాతానికి పెరిగింది. ఈ 5G స్మార్ట్‌ఫోన్‌లు రెండో త్రైమాసికంలో 47శాతం మార్కెట్ వాటాను పొందాయి.

Also Read :- హైదరాబాద్లో జపాన్ క్యాసియో స్టోర్​ షురూ

2023లో దాదాపు 31 మిలియన్ల భారతీయ వినియోగదారులు 5G ఫోన్లకు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉందని ఇటీవల ఎరిక్సన్ కన్స్యూమర్ ల్యాబ్ నివేదిక వెల్లడించింది.నెట్ వర్క్ సాటిస్ ఫాక్షన్ లో భారత్ లో 4జీ కంటే 5జీ 30 శాతం వృద్ధిని సాధించింది. హెచ్ డీ స్ట్రీమింగ్, వీడియో కాల్స్, మొబైల్ గేమింగ్స్, అగ్మెంటెడ్ రియాల్టీల్లో 5జీ వినియోగదారులు మంచి మెరుగుదలను చూసినట్టు తెలుస్తోంది. 
పండుగల సీజన్ కాబట్టి..వినయోగదారులు కొత్త కొనుగోళ్లపై ఆసక్తి చూపుతారు. ఈ ట్రెండ్ దేశంలో 5జీ స్మార్ట్ ఫోన్ల షిప్ మెంట్ల పెరుగుదల కొనసాగుతుందని అంచనా.