రైలుకు యజమాని అయిన ఇండియన్ రైతు.. రైల్వే తప్పిదమే కారణం

రైలుకు యజమాని అయిన ఇండియన్ రైతు.. రైల్వే తప్పిదమే కారణం

దాదాపు అందరూ రైలులో ప్రయాణించి ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ తాను కూర్చున్న రైలుకు యజమాని కాగలరా. రైల్వేను ప్రైవేటీకరించబడిన అనేక దేశాల్లో, ఈ ఆలోచన సాధ్యమే. కానీ భారతదేశం వంటి దేశాల్లో ఇది అసాధ్యం. ఎందుకంటే రైల్వేలు ప్రభుత్వంచే నిర్వహించబడుతున్నాయి. కానీ కొన్ని సంవత్సరాల క్రితం, లూథియానాలో నివసిస్తున్న ఒక రైతు అకస్మాత్తుగా రైలుకు యజమాని అయ్యాడు (స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ యజమాని).Swar

 లూథియానాలోని కటనా గ్రామంలో నివసించే సంపూరన్ సింగ్ అనే రైతు అకస్మాత్తుగా ఢిల్లీ నుంచి అమృత్‌సర్‌కు (ఢిల్లీ-అమృతసర్ స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్) వెళ్లే సంపూర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (12030) రైలుకు యజమాని అయ్యాడు. కానీ రైలు యజమాని ఎలా అవుతాడు? వివరాల్లోకి వెళితే.. వాస్తవానికి 2007లో లూథియానా-చండీగఢ్ రైలు మార్గం నిర్మాణ సమయంలో రైతుల భూములను రైల్వేశాఖ స్వాధీనం చేసుకుంది. అప్పట్లో ఎకరం రూ.25 లక్షలకు భూమిని సేకరించగా, దానికి సమానంగా సమీపంలోని గ్రామంలో ఎకరా రూ.71 లక్షలకు భూమిని సేకరించారు.

ఈ విషయంపై ఆగ్రహానికి గురైన సంపూరణ్ సింగ్.. కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. తొలి ఉత్తర్వులో రూ.25 లక్షల పరిహారం మొత్తాన్ని రూ.50 లక్షలకు పెంచిన కోర్టు.. ఆపై దాన్ని రూ.1.47 కోట్లకు పైగా పెంచింది. ఈ క్లెయిమ్ పిటిషన్ 2012లో దాఖలైంది. 2015 నాటికి ఉత్తర రైల్వే ఈ మొత్తాన్ని చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అప్పట్లో రూ.1.05 కోట్లు చెల్లించాల్సి ఉండగా... రైల్వే రూ.42 లక్షలు మాత్రమే ఇచ్చింది.
 
అలా రైల్వే డబ్బు చెల్లించకపోవడంతో 2017 లో జిల్లా, సెషన్స్ జడ్జి జస్పాల్ వర్మ లుథియానా స్టేషన్‌లో రైలును అటాచ్‌మెంట్ చేయాలని ఆదేశించారు. దీంతో పాటు స్టేషన్ మాస్టర్ కార్యాలయాన్ని కూడా అటాచ్ చేయాలని కోరారు. సంపూరణ్ సింగ్ లాయర్లతో కలిసి స్టేషన్ కు చేరుకుని రైలును సీజ్ చేశారు. అలా సంపూరణ్ సింగ్ ఆ రైలు యజమాని అయ్యాడు. అయితే సెక్షన్ ఇంజనీర్ కోర్టు అధికారి ద్వారా 5 నిమిషాల్లోనే ఆ రైలును విడిపించారు. ఎందుకంటే అలా చేసి ఉంటే వందలాది మంది ప్రజలు ఇబ్బందులు పడేవారు. పలు నివేదికల ప్రకారం, ఈ అంశం ఇంకా కోర్టులో పెండింగ్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది.