కారులో 400 రోజులు.. లక్ష కిలోమీటర్లు..

కారులో 400 రోజులు.. లక్ష కిలోమీటర్లు..

అవయవ దానంపై 43 దేశాల్లో ఇండో అమెరికన్‌ దంపతుల ప్రచారం
ఓ ఇండో అమెరికన్‌‌ జంట కారులో 400 రోజుల్లో లక్ష కిలోమీటర్లు తిరిగింది. 43 దేశాల్లోని 73 వేల మందిని కలుసుకుంది. ఈ 400 రోజులు కారునే ఇల్లుగా చేసుకుంది. అందులోనే తిండి, నిద్ర. ఇదంతా అవయవదానంపై ప్రచారం చేయడానికి. జనాలలో అవేర్‌నెస్‌‌ పెంచడానికి. ఆ భార్యభర్తల పేర్లు దీపాలి, అనిల్‌ శ్రీవత్స. అమెరికాలో స్థిరపడిన కుటుంబం. అనిల్‌ వ్యాపారవేత్త. ఆరేళ్ల కిందట తన సోదరుడి ప్రాణాలు నిలబెట్టేందుకు అనిల్‌ కిడ్నీ ఇచ్చారు. అది ఆయన్ను ఎంతో ప్రభావితం చేసింది. ప్రతి ఒక్కరూ అవయవదానం చేసేలా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ‘గిఫ్ట్‌‌ ఆఫ్‌‌ లైఫ్‌‌ అడ్వెంచర్‌ ’ అంటూ భార్యతో కలిసి కారులో ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు, రోటరీ క్లబ్‌లు, కమ్యూనిటీ సెంటర్లు, ఆఫీసులకు వెళ్లి జనాలతో మాట్లాడారు. అవయవదానం, దానికి సంబంధించి చట్టాలను వివరించారు. మార్చిలోనూ మరో యాత్రకు అనిల్‌ జంట ప్లాన్‌‌ చేసింది. న్యూయార్క్ నుంచి అర్జెంటీనాకు వెళ్లాలని నిర్ణయించుకుంది. కాగా, 1997-నుంచి 2006 వరకు ‘అనిల్- కి- ఆవాజ్’ సిండికేటెడ్‌‌ రేడియో టాక్‌‌ షో నిర్వహించి లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అనిల్‌ స్థానం సంపాదించారు.

For More News..

గర్ల్‌ఫ్రెండ్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి..

గిన్నిస్ బుక్‌లోకెక్కిన ప్రపంచపు పొట్టి వ్యక్తి ఇకలేరు