కేంద్ర మంత్రుల జీతభత్యాలకు రూ.1249 కోట్లు

కేంద్ర మంత్రుల జీతభత్యాలకు రూ.1249 కోట్లు

న్యూఢిల్లీ : కేంద్ర మంత్రులు, క్యాబినెట్  సెక్రటేరియట్, ప్రధానమంత్రి కార్యాలయం, దేశంలో పర్యటించే అతిథుల ఆతిథ్యం కోసం బడ్జెట్ లో రూ.1248.91 కోట్లు కేటాయించారు. 2023–24లో వీరందరికి రూ.1803.01 కోట్లు కేటాయించగా ఈసారి రూ.1248.91 కోట్లు అలొకేట్  చేశారు. కేంద్ర మంత్రిమండలి సభ్యుల ఖర్చులకు రూ.832.81 కోట్లు కేటాయించారు. అందులో మంత్రుల జీతభత్యాలు, ప్రయాణ ఖర్చులు, ఇతర భత్యాలు ఉన్నాయి.

నేషనల్  సెక్యూరిటీ కౌన్సిల్  సెక్రటేరియట్ కు రూ.200 కోట్లు కేటాయించారు. అలాగే ప్రిన్సిపల్  సైంటిఫిక్  అడ్వైజర్  (పీఎస్ఏ) ఆఫీసుకు రూ.76.20 కోట్లు అలొకేట్  చేశారు. క్యాబినెట్  సెక్రటేరియట్ కు రూ.70 కోట్లు కేటాయించారు. ప్రధాన మంత్రి కార్యాలయానికి రూ.65.30 కోట్లు కేటాయించారు. దేశంలో పర్యటించే విదేశీ అతిథులు, నేషనల్ డే రోజున రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసే కార్యక్రమాలకు రూ.4 కోట్లు, మాజీ గవర్నర్ల  సహాయకుల కోసం రూ.1.80 కేటాయించారు.