కేసీఆర్ సీఎంలను కలుసుడు కొత్తేంగాదు!

కేసీఆర్ సీఎంలను కలుసుడు కొత్తేంగాదు!
  • మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్

ముంబై: సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల సీఎంలను కలవడం కొత్తేమీ కాదని మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. కేంద్రంలో బీజేపీకి ఆల్టర్నేట్ గా థర్డ్ ఫ్రంట్ తేవాలన్న ఆయన ప్రయత్నం ఒక విఫల ప్రయోగంగా మిగిలిపోతుందన్నారు. సోమవారం ఔరంగాబాద్‌లో ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేను కేసీఆర్ కలవడంపై స్పందిస్తూ.. రాష్ట్రాల సీఎంలు ఇలా కలవడం కొత్త ముచ్చటేమీ కాదన్నారు. వీరు గత లోక్ సభ ఎన్నికల ముందు కూడా కలిసినా, ఎలాంటి ఫలితం లేకపోయిందని గుర్తుచేశారు. గతంలో కూడా థర్డ్ ఫ్రంట్ ప్రపోజల్స్ ముందుకు వచ్చినప్పటికీ ఫెయిల్ అయ్యాయన్నారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ మొదటిస్థానంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తల కోసం..

బంగారు భారతదేశం తయారు చేసుకుందాం

కరోనా భయం, ముందస్తు మొక్కులే కారణం

ప్రకాశ్ రాజ్‌కు సీఎం కేసీఆర్ ఆఫర్‌‌