
మలప్పురం: ‘మెట్రో మ్యాన్’గా పేరు గడించిన ఈ.శ్రీధరన్ రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఏప్రిల్‌లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన శ్రీధరన్.. ఏడాది గడవక ముందే పాలిటిక్స్‌కు గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు మలప్పురంలో ఆయన ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి తాను పాఠాలు నేర్చుకున్నానని శ్రీధరన్ అన్నారు. తానెప్పుడూ పొలిటీషియన్‌గా ఉండలేదని, ఒక బ్యూరోక్రాట్‌గానే ఉన్నానని చెప్పారు.
#ESreedharan popularly known as #MetroMan announces that he is quitting active politics. pic.twitter.com/pBUY2CdGGC
— All India Radio News (@airnewsalerts) December 16, 2021
‘నా వయస్సు 90 ఏళ్లు. ఈ వయస్సులో రాజకీయాల్లో ముందుకెళ్లడం ప్రమాదకరం. పాలిటిక్స్‌లో నాకు ఎలాంటి డ్రీమ్స్ లేవు. నా రాష్ట్రానికి, ప్రజలకు సేవ చేసేందుకు పాలిటిక్స్ అవసరం లేదు. మూడు ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా’ అని శ్రీధరన్ చెప్పారు. ఇకపోతే, దేశంలో ప్రజా రవాణా వ్యవస్థ రూపు రేఖలను మార్చిన శ్రీధరన్‌కు భారత్ తోపాటు విదేశాల్లోనూ మంచి పేరుంది.
మరిన్ని వార్తల కోసం: