మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి:హరీశ్ రావు

మోడీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి:హరీశ్ రావు

తెలంగాణపై అక్కసు వెళ్ళగక్కిన ప్రధాని మోడీ బేషారుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి హరీశ్ రావు. ప్రధానికి వలస కార్మికులంటే ఎందుకు చిన్న చూపు చూస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో వాళ్లను  కేంద్రం పట్టించుకోపోయినా రాష్ట్ర ప్రభుత్వం వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చామన్నారు. కోవిడ్ సమయంలో ట్రంప్ ను తీసుకొచ్చి గుజరాత్ లో మీడింగ్ పెట్టినప్పుడు వ్యాప్తి చెందని కరోనా..వలస కార్మికులను స్వస్థలాలకు పంపిస్తే కరోనా పెరిగిందని మాట్లడడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ ఉద్యమ్యాన్ని కించపరిచే విధంగా ప్రధాని మోడీ మాట్లాడుతున్నారని..అమరుల త్యాగాలను చిన్నచేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బడ్జెట్ లో మొండి చెయ్యి చూపించారని...వరంగల్ కు కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 

మరిన్ని వార్తల కోసం

 

నిజాయితీ చాటుకున్న ఆటోడ్రైవర్

ప్రధానిపై టీఆర్ఎస్ ఎంపీల ప్రివిలేజ్ మోషన్‌