నల్గొండ జిల్లా : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కరోనా బారిన పడ్డారు. నిన్న స్వల్ప జ్వరంతో అస్వస్థతకు గురికావడంతో అనుమానంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే తాను భేషుగ్గానే ఉన్నానని, డాక్టర్ల సూచన మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రకటించారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు. కరోనా నిర్ధారణ కాకపోయినా వైద్యుల సూచనలు, జాగ్రత్తలు పాటించి కరోనా వ్యాప్తిని అరికట్టాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు.
ఇవి కూడా చదవండి
క్రీడలను.. క్రీడాకారులను ప్రోత్సహిస్తాం
ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశ పరీక్షల షెడ్యూల్ రిలీజ్
ఘనంగా బీటింగ్ రిట్రీట్.. డ్రోన్ షోతో అగ్ర దేశాల సరసన భారత్
