ఇలా కూడా జరుగుతోందా.? స్కూటర్ అప్‌డేట్ అడిగింది.. ఆఫీస్‌కు లేటైంది

ఇలా కూడా జరుగుతోందా.? స్కూటర్ అప్‌డేట్ అడిగింది.. ఆఫీస్‌కు లేటైంది

పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయంటూ.. ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలవైపు చూస్తున్నారు. ఖర్చు తక్కువ, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అని ఆలోచించి కొత్త బైక్ కొనాలనుకునే వారు ఎలక్ట్రిక్ వేయికిల్స్ ను ఎంచుకుంటున్నారు. భారత్ లో పూర్తిగా అప్ డేట్ కాని టెక్నాలజీ వల్ల ఎలక్ట్రిక్ వాహనాలు వాడుతున్నా వారు కూడా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. నోయిడాలో ఓ వ్యక్తి తన ఎలక్ట్రిక్ స్కూటర్ వల్ల వింత ఘటన ఎదుర్కొన్నాడు. 

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో నివసించే ప్రతిక్ రాయ్ తన ఆథర్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనంపై ఆఫీస్‌కు బయల్దేరాడు. ఇంటి నుంచి బయల్దేరగానే స్కూటర్ సాఫ్ట్ వేర్ అప్డేట్ అడిగింది. దీంతో రాయ్ ఆఫీస్‌కు వెళ్లడం చాలా ఆలస్యమైంది. అప్పుడు తాను ఏం అని ఆఫీస్‌కు ఇంటిమేషన్ ఇచ్చాడో నవ్వుకుంటూ ఎక్స్‌లో తన బాధను షేర్ చేసుకున్నాడు. నేను ఆఫీస్‌కు రావటం లేటవుతుంది. నా స్కూటర్ అప్డేట్ అడిగిందని ఆఫీస్‌లో చెప్పాల్సి వచ్చిందట. తనకు ఎదురైన ఈ ప్రాబ్లమ్ ఎక్స్‌లో పంచుకున్నాడు. తన బాధ తెలుసుకున్న నెటిజన్లు ఇలా కూడా జరుగుతుందా అని సరదాగా కాసేపు నవ్వుకున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్ మీకు వస్తే ఏం చేస్తారో కామెంట్ చేయండి అని ప్రశ్నించగా... చాలా మంది రకరకాలుగా సెటెరికల్ కామెంట్స్ చేశారు. రాయ్ పోస్ట్‌కు ఆథర్ కంపెనీ స్పందించి ఎక్స్‌లో క్షమాపణ కోరింది.

ALSO READ :;- ఐపీఎల్‌కే ఓటేసిన న్యూజిలాండ్ క్రికెటర్లు..కివీస్ జట్టుకు కొత్త కెప్టెన్‌