అకౌంట్ లేకుండా చాట్ జీపీటీని ఇలా వాడుకోవచ్చు

అకౌంట్ లేకుండా చాట్ జీపీటీని ఇలా వాడుకోవచ్చు

సాంకేతిక ప్రపంచంలోకి వచ్చీ రావటంతోనే  చాట్ జీపీటీ సంచలనాలు సృష్టించింద. ఇది ఓ కొత్తతరం సెర్చ్‌ ఇంజిన్‌. దీనిని ప్రారంభించిన వారంలోనే దాదాపు 10 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకొన్నారు. ప్రస్తుతం 185 దేశాల్లో 100 మిలియన్ల కంటే ఎక్కువ మంది అనేవి కొత్త విషయాలను తెలుసుకోవడానికి వారానికి ఒక్కసారైనా ChatGPTని ఉపయోగిస్తున్నారని OpenAI  తెలిపింది. ప్రస్తుతం చాట్ జీపీటీ అకౌంట్ ఉన్నవారు మాత్రమే చాట్ జీపీట్ ని వాడుకుంటున్నారు. అకౌంట్ క్రియేట్ చేయకుండా, చాట్ జీపీటీ రిజిస్టర్ అయి సైన్ ఇన్ కాకుండా ఉపయోగించేలా ఉంటే ఇంకా ఎక్కవ మందికి ఈ చాట్ జీపీటీ అందుబాటులోకి వస్తే యూజర్ల పెరిగే అవకాశం ఉంది. 

ALSO READ | హ్యాపీ బర్త్ డే Gmail.. అప్పుడు ఏప్రిల్ ఫూల్ అన్నారు.. ఇప్పుడు అన్నింటికీ అదే

అందుకే ప్రస్తుతం చాట్ బాట్ ఉపయోగించికోవాలనుకునే వారు రిజిస్టర్ కాకుండానే ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ ఉపయోగించుకోవచ్చు. ఏఐ మోడల్ కు ట్రైనింగ్ ఇవ్వడానికి మాత్రం డేటా అవసరం ఉంటుంది. సైన్ ఇక్ కాకుండా చాట్ బాట్ ఉపయోగించే వారికి కొన్ని రూల్స్ ఉంటాయి. చాట్ హిస్టరీని సేవ్ చేసుకోని తర్వాత చూసుకోలేరు. అయితే మీరు చాట్ చేసిన ప్రతి సారి ఆ చాట్ ఉండదు. వాయిస్ చాట్ కూడా అందుబాటులో ఉండదు.  డివైస్ లో అకౌంట్ క్రియేట్ చేయకుండా చాట్ జీపీటీ వాడిన ప్రతీసారి ఓపన్ ఏఐ కొన్ని పర్మిషన్స్ అడుగుతోంది.