తీవ్ర సంక్షోభంలో పాక్.. ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్

తీవ్ర సంక్షోభంలో పాక్.. ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్

పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిత్యావసర ధరలు చుక్కలను తాకుతున్నాయి. తిండి దొరక్క పేదలు అల్లాడిపోతున్న పరిస్థితి. తాజాగా కన్ జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చెప్పిన లెక్కలు.. పాక్ లో పరిస్థితికి అద్దం పడుతున్నాయి. గడిచిన ఆరేళ్లలో తొలిసారిగా ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్ ను తాకింది. జులై నెలలో ద్రవ్యోల్బణం 10.34గా నమోదైంది. గతేడాది జులైలో ఇన్ ఫ్లేషన్ 5.84గా ఉండేది. ఏడాదిలోనే పాకిస్థాన్ లో పరిస్థితులు దారుణంగా మారాయి.

  • కొన్ని నెలలుగా పాకిస్థాన్ పెట్రోల్ , డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
  • తాజాగా లీటర్ పెట్రోల్ పై అక్కడ రూ.5.15 , లీటర్ డీజిల్ పై రూ.5.65 రేటు పెరిగింది.  పాక్ లో లీటర్ పెట్రోల్ రూ.117.83 గా ఉంది. లీటర్ డీజిల్ రూ.132.4 గా ఉంది.
  • కిరోసిన్, లైట్ డీజిల్ కూడా లీటర్ కు రూ.132.47, రూ.103.84గా ఉన్నాయి.
  • ఇంధన ధరలు సెంచరీని దాటి.. డబుల్ సెంచరీ వైపు పరుగులు పెడుతున్నాయి.
  • సామాన్యులకు తక్కువ రేటుకు దొరికే నాన్, రోటీలపై ధరల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. వాటిని రూ.10 కంటే తక్కువకు దొరికేలా ప్రయత్నాలు చేస్తోంది.
  • ధరల సంక్షోభంలో ఉన్నప్పుడు పదవిలోకి వచ్చిన ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అక్కడి జనం సీరియస్ గా ఉన్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి పాక్ ప్రభుత్వం తల బద్దలు కొట్టుకుంటోంది.
  • పాక్ విజ్ఞప్తితో… చైనా, ఖతార్ లాంటి దేశాలు… ఆపత్కాలంలో ఉద్దీపన ప్యాకేజీలు అందించాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 6 బిలియన్ యూఎస్ డాలర్ల ప్యాకేజీని గత మే నెలలో అందించింది.