
టెర్రరిజాన్ని పెంచి పోషిస్తోంది ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుసని ప్రధాని మోడీ అన్నారు. అమెరికాలో 9/11.. ఇండియాలో 26/11 ఎటాక్స్‌కు కుట్రలు ఎక్కడ జరిగాయో కూడా అందరికీ తెలుసని పరోక్షంగా పాకిస్తాన్ పై ఫైరయ్యారు. ఇండియా అభివృద్ధిలో దూసుకెళ్తుంటే కొం దరు చూడలేకపోతున్నా రంటూ చురకలంటిం చారు. హౌడీ మోడీ సభలో ఆర్టికల్ 370 రద్దును కూడా ప్రధాని ప్రస్తావించారు. పార్లమెంట్ లో ఆర్టికల్ 370పై గంటల తరబడి చర్చ జరిగిందని.. రాజ్యసభలో బలం లేకున్నా బిల్లుకు మద్దతు లభించిం దన్నా రు. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛ కల్పిం చామని.. రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ కాశ్మీర్ ప్రజలకు వర్తిస్తాయని చెప్పా రు.