
పాట్నా: ప్రధాని నరేంద్ర మోడీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ పై రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శలకు దిగారు. మోడీ, నితీశ్ లకు పిల్లల్ని ఇవ్వాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. కుటుంబ పార్టీలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని మోడీ చేసిన వ్యాఖ్యలపై స్పందనగా లాలూ పైకామెంట్ చేశారు. మోడీ, నితీశ్ లకు పిల్లలు లేకపోతే తానేం చేయాలని ప్రశ్నించారు. ‘మోడీకి పిల్లలు లేరు. దానికి నేనేం చేయాలి? నితీశ్ కు కొడుకు ఉన్నాడు. కానీ అతడు రాజకీయాలకు పనికిరాడు. మోడీ, నితీశ్ కు పిల్లల్ని ఇవ్వాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా’ అని లాలూ పేర్కొన్నారు.
I pray that God offere children to Modi and Nitish to do "Parivarwad'. Nitish' son is no good for politics : @RJDforIndia patron @laluprasadrjd#UttarPradeshElections#Bihar pic.twitter.com/b5aFqgTt9H
— Arvind Chauhan (@Arv_Ind_Chauhan) February 11, 2022
మరిన్ని వార్తల కోసం: